ఒకే రోజున మూడు పోటీ ప‌రీక్ష‌లు.. అభ్యర్థుల ఆందోళన

Three Competitive Exams for single day.ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించాలనేది ప్ర‌తి ఒక్క‌రి క‌ల‌. అందుకోసం అభ్యర్థులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 July 2022 8:08 AM IST
ఒకే రోజున మూడు పోటీ ప‌రీక్ష‌లు.. అభ్యర్థుల ఆందోళన

ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించాలనేది ప్ర‌తి ఒక్క‌రి క‌ల‌. అందుకోసం అభ్యర్థులు అహోరాత్రులు శ్రమిస్తుంటారు. అయితే.. ఆగస్టు 7న ఒకే రోజు రాష్ట్ర‌, జాతీయ స్థాయిలో క‌లిపి మూడు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో దేనికి హాజ‌రు కావాలో తేల్చుకోలేక నిరుద్యోగులు నిర్వేదం వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎస్ఐ( SI) రిక్రూట్‌మెంట్ ప‌రీక్ష‌, జాతీయ స్థాయి సీఏపీఎఫ్(CAPF) అసిస్టెంట్ కమాండెంట్ పరీక్ష, ఐబీపీఎస్ ఆర్ఆర్‌బి పీఓ(IBPS RRB PO)ల‌లో అభ్య‌ర్థులు ఒక ప‌రీక్ష‌ను రాసేందుకు మాత్ర‌మే అవ‌కాశం ఉంద‌ని, త‌మ త‌ప్పు లేకుండానే అవ‌కాశాల‌ను కోల్పోతున్నందుకు క‌ల‌త చెందుతున్నారు.

అక్షయ్ (పేరు మార్చబడింది) 2019 నుండి తెలంగాణ పోలీసు SI రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నాడు. అత‌డు తొలిసారి 2018లో ప‌రీక్ష‌కు హాజ‌రు అయ్యాడు. అందులో విజ‌యం సాధించ‌లేక‌పోయాడు. దీంతో అప్ప‌టి నుంచి రెండో అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఏప్రిల్ 2022లో తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో మ‌రో అవ‌కాశం దొరికింద‌ని అక్ష‌య్ చాలా సంతోషించాడు. SI రిక్రూట్‌మెంట్ కోసం ప్రిలిమినరీ రాత పరీక్ష ఆగస్టు 7న నిర్వహించబడుతుందని TSLPRB ప్రకటించింది. అయితే.. అదే రోజు UPSC నిర్వహించే సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) అసిస్టెంట్ కమాండెంట్ పరీక్ష ఉండ‌డంతో అక్ష‌య్ నిరాశ చెందారు. రెండు ప‌రీక్ష‌ల్లో ఏదీ రాయాలో తెలియ‌క అయోమ‌యంలో ప‌డ్డాడు. త‌న త‌ప్పు లేకుండానే ఒక అవ‌కాశాన్ని కోల్పోతుంద‌న‌కు అత‌డు బాధ‌ప‌డ్డాడు.

"నేను ఈ ప‌రీక్ష కోసం 2019 నుంచి ఎదురుచూస్తున్నాను. గ‌త మూడేళ్లుగా నా ల‌క్ష్యంపైనే దృష్టి పెట్టాను. అందుకోసం ఎంతో ఓపిక‌క‌గా ఉన్నాను. ఇందుకు నా త‌ల్లిదండ్రుల‌ను ఒప్పించ‌డం చాలా క‌ష్ట‌మైంది. క‌రోనా కార‌ణంగా 2020, 2021లో ఆర్థికంగా నా కుటుంబం ఎన్నో ఇబ్బందులు ప‌డుతుండ‌డంతో నా ప్రిప‌రేష‌న్‌ను ఆపేసి ఏదైనా ఉద్యోగం చూసుకోమ‌ని త‌ల్లిదండ్రులు ఒత్తిడి తీసుకువ‌చ్చారు. ఇంకా ఎన్ని సంవ‌త్స‌రాలు ఇలా ప్ర‌య‌త్నిస్తావు అని అడిగారు. వారికి న‌చ్చ‌జెప్ప‌డానికి చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది" అని అక్ష‌య్ చెప్పారు.

అక్షయ్‌కి 26 ఏళ్లు, ఎస్‌ఐ పోస్టుకు 30 ఏళ్ల వయోపరిమితి ఉన్నందున అక్షయ్ కూడా ఆందోళన చెందుతున్నాడు. "రాష్ట్ర స్థాయి SI రిక్రూట్‌మెంట్ ప్రతి సంవత్సరం జరగదు కాబట్టి, తదుపరి పరీక్ష ఎప్పుడు నిర్వహించబడుతుందో మాకు తెలియదు. ఇది కొన్నిసార్లు రెండేళ్లకు ఒకసారి, కొన్నిసార్లు మూడేళ్లకు ఒకసారి జరుగుతుంది" అని అక్షయ్ చెప్పారు.

మరో అభ్య‌ర్థి.. కరీంనగర్‌కు చెందిన సాయి వంశీ కూడా రాష్ట్ర స్థాయి SI పరీక్ష, CAPF పరీక్ష మరియు IBPS RRB పరీక్షలు మూడింటికి దరఖాస్తు చేసుకున్నాడు. పోలీసుశాఖ రిక్రూట్‌మెంట్‌లో ఎక్కువ ఖాళీలు లేవు కాబ‌ట్టి అవ‌కాశం ఉన్న అన్ని కాంపిటిష‌న్ ప‌రీక్ష‌లు వ్రాసామ‌ని చెప్పాడు.

"చాలా మంది అభ్యర్థులు ఈ మూడు పరీక్ష‌ల్లో రెండు ప‌రీక్ష‌ల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అంటే రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ పరీక్ష రాసే వారు సెంట్రల్ లెవల్ పరీక్ష కూడా రాస్తున్నారు. అందువ‌ల్ల రెండు ప‌రీక్ష‌ల‌ను ఒకే రోజు నిర్వ‌హించ‌డం స‌రికాదు అని వంశీ అన్నాడు. CAPF పరీక్షలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు పేపర్ 2 నిర్వ‌హించ‌బ‌డుతుంద‌ని, అందువ‌ల్ల ఉద‌యం ఒక ప‌రీక్ష రాసి సాయంత్రం మ‌రొక ప‌రీక్ష‌కు హాజ‌రు కావ‌డం సాధ్యం కాద‌ని వంశీ చెప్పాడు.

టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు, మంత్రి కేటీఆర్‌కు పలుమార్లు విన‌తి ప‌త్రాల‌ను ఇచ్చినప్పటికీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స్పంద‌న లేద‌న్నారు. చాలా మంది తమ ఆందోళనలను ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన అగ్నిపథ్ నిరసనలు మరియు ఆ తర్వాత జరిగిన అరెస్టుల అనంత‌రం కొంతమంది ఆశావాదులు మాట్లాడటానికి భయపడుతున్నారని ఆశావాదులలో ఒకరు న్యూస్‌మీటర్‌తో చెప్పారు.

Next Story