గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్‌.. ఇదే ఆఖరి అవకాశం

తెలంగాణ గ్రూప్‌-1 దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు టీఎస్‌పీఎస్సీ (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది.

By అంజి  Published on  27 March 2024 1:30 AM GMT
TSPSC, Group 1 applications, Telangana

గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్‌.. ఇదే ఆఖరి అవకాశం

తెలంగాణ గ్రూప్‌-1 దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు టీఎస్‌పీఎస్సీ (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను ఎడిట్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇదే చివరి అవకాశం అని పేర్కొన్నారు. 563 గ్రూప్‌-1 పోస్టులకు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్‌ 9వ తేదీన ప్రిలిమ్స్‌, అక్టోబర్‌ 21వ తేదీన మెయిన్స్‌ పరీక్ష జరగనుంది. ఎవరైనా అభ్యర్థులు ఎడిట్‌ చేసుకోవాలనుకుంటే.. https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో ఎడిట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్య తేదీలు:

గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల - ఫిబ్రవరి 19,2024

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - ఫిబ్రవరి 23, 2024

దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - మార్చి 03,2024

దరఖాస్తుల సవరణకు అవకాశం - మార్చి 23 నుంచి మార్చి 27,2024

హాల్ టికెట్లు డౌన్లోడ్ - పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి అందుబాటులోకి వస్తాయి. 33 జిల్లా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించనున్నారు. గతంలో అప్లయ్ చేసుకున్న అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్ కు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్‌-1 పరీక్ష రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.

Next Story