Telangana: టెట్‌ హాల్‌ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ టెన్‌ - 2024 పరీక్షలకు హాల్‌ టికెట్లు విడుదల అయ్యాయి.

By అంజి  Published on  16 May 2024 2:15 PM GMT
Telangana, Tet Hall Tickets , tstet2024

Telangana: టెట్‌ హాల్‌ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ టెన్‌ - 2024 పరీక్షలకు హాల్‌ టికెట్లు విడుదల అయ్యాయి. అభ్యర్థులు https://tstet2024.aptonline.in/tstet వెబ్‌సైట్‌ నుంచి తమ హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. గురువారం సాయంత్రం 6 గంట‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. టెట్ హాల్ టికెట్ల‌ను వెబ్‌సైట్‌లో ఉంచారు. తొలిసారి కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో నిర్వహిస్తున్న టెట్‌ పరీక్షలు జూన్‌ 2వ తేదీన ముగుస్తాయి. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగుతాయి.

టెట్‌కు సుమారు 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 48,582 మంది సర్వీస్‌ టీచర్లు కూడా దరఖాస్తులు సమర్పించారు. టెట్ హాల్ టికెట్ల‌ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే జ‌ర్న‌ల్ నంబ‌ర్, టెన్త్ మెమో త‌ప్ప‌నిస‌రి. ఈ రెండు లేక‌పోతే హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవ‌డం కుదరదు. ద‌ర‌ఖాస్తు ఆన్‌లైన్‌లో స‌మ‌ర్పించిన‌ప్పుడు జ‌ర్న‌ల్ నంబ‌ర్ జ‌న‌రేట్ అవుతుంది. ఆ నంబ‌ర్‌తో పాటు పుట్టిన తేదీని స‌మ‌ర్పించి, హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు.

హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రాసెస్ ఇదే

- తెలంగాణ టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

- హోం పేజీలో కనిపించే ' Download Hall Tickets 2024 ఆప్షన్ పై నొక్కాలి.

- రిజిస్ట్రేషన్(Journal Number) వివరాలతో పాటు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.

- సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.

- డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

టెట్ పరీక్ష షెడ్యూల్

మే 20, 2024 – పేప‌ర్ 2 - మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S1)

మే 20, 2024 – పేప‌ర్ 2 - మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S)

మే 21, 2024 – పేప‌ర్ 2 -మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S1)

మే 21, 2024 – పేప‌ర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S2)

మే 22, 2024 – పేప‌ర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S1)

మే 22, 2024 – పేప‌ర్ 2 -మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S2)

మే 24, 2024 – పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్(మైన‌ర్ మీడియం)(సెష‌న్ – S1)

మే 24, 2024 – పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S2)

మే 28 , 2024– పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S1)

మే 28, 2024 – పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S2)

మే 29, 2024 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S1)

మే 29, 2024 – పేప‌ర్ 2- సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S2)

మే 30 , 2024– పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)

మే 30, 2024 – పేప‌ర్ 1- (సెష‌న్ – S2)

మే 31, 2024 – పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)

మే 31, 2024 – పేప‌ర్ 1 -(సెష‌న్ – S2)

జూన్ 1 , 2024– పేప‌ర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైన‌ర్ మీడియం)(సెష‌న్ – S1)

జూన్ 1, 2024 – పేప‌ర్ 1-(మైన‌ర్ మీడియం) (సెష‌న్ – S2)

జూన్ 2 , 2024– పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)

జూన్ 2 , 2024– పేప‌ర్ 1- (సెష‌న్ – S2).

Next Story