తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ రోజు ఉదయం టెట్ పలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. www.tstet.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చూడొచ్చు.
చాలా కాలం తరువాత తెలంగాణలో టెట్ పరీక్షను జూన్ 12న నిర్వహించారు. దీంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 90 శాతం మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఉదయం నిర్వహించిన పేపర్-1కు 3,18,506 (90.62శాతం), పేపర్-2కు 2,51,070 (90.35శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంతో పోలిస్తే ఈ సారి ప్రశ్నల సరళి సులువుగా ఉందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ సారి ఎక్కువ సంఖ్యలో టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది.