శుభవార్త.. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్.. శాఖల వారీగా పోస్టుల వివరాలు ఇవే
Telangana Finance Department gives Green signal to 30453 posts.తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల నిరీక్షణ ఫలించనుంది.
By తోట వంశీ కుమార్ Published on 24 March 2022 8:50 AM ISTతెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల నిరీక్షణ ఫలించనుంది. ఎప్పటినుంచో ఊరిస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. 30,453 పోస్టుల భర్తీకి వీలుగా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి సంబంధించి శాఖలవారీగా నియామక అనుమతుల జీవోలను జారీ చేసింది. ఏయే బోర్డులు ఏయే పోస్టుల ఎంపిక బాధ్యతలు చేపట్టాలో నిర్దేశించింది. అలాగే.. ఉపాధ్యాయ నియామకాలకు వీలుగా టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టెట్) నిర్వహణకు విద్యాశాఖ ప్రత్యేక ఉత్తర్వులిచ్చింది.
తొలి విడతగా భర్తీ కానున్న ఉద్యోగాల్లో గ్రూప్ 1 కింద 503 పోస్టులను, పోలీసు నియామక సంస్థ ద్వారా భర్తీ కానున్న జైళ్ల శాఖకు చెందిన 154 పోస్టులు, పోలీసు శాఖలో 16,587 పోస్టులు, టీఎస్పీఎస్సీ ద్వారా జైళ్ల శాఖలో భర్తీ కానున్న 31 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, వైద్య ఆరోగ్య శాఖలో 2,662 పోస్టులతో పాటు మరికొన్ని శాఖలకు చెందిన పోస్టులు ఉన్నాయి.
టీఎస్‌పీఎస్సీ ద్వారా గ్రూప్ –1 పోస్టులు
జిల్లా బీసీ అభివద్ధి అధికారి–2, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్–40, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్–38, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(వైద్యారోగ్యశాఖ)–20, డీఎస్పీ– 91, జైల్స్ డిప్యూటీ సూపరిండెంట్–2, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్–8, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్–2, జిల్లా మైనారీటీ వెల్ఫేర్ ఆఫీసర్–6, మునిసిపల్ కమిషనర్ గ్రేడ్–2(35), ఎంపీడీవో(121), డీపీవో(5), కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్(48), డిప్యూటీ కలెక్టర్(42), అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్(26), జిల్లా రిజిస్ట్రార్(5), జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్(3), ఆర్టీవో(4), జిల్లా గిరిజన సంక్షేమాధికారి(2)
మొత్తం 503
జైళ్ల శాఖ
డిప్యూటీ జైలర్ (8), వార్డర్ (136), వార్డర్ ఉమెన్ (10)
మొత్తం 154
పోలీసు శాఖ
కానిస్టేబుల్ సివిల్ (4965), ఆర్మడ్ రిజర్వ్(4423), టీఎస్‌ఎస్‌పీ(5704), కానిస్టేబుల్ ఐటీ అండ్ సీ(262), డ్రైవర్లు పిటీవో(100), మెకానిక్ పీటీవో(21), సీపీఎల్(100), సబ్ ఇన్‌స్పెక్టర్ సివిల్(415), ఎస్‌ఐ ఏఆర్(69), ఎస్‌ఐ టీఎస్‌ఎస్‌పీ(23), ఎస్‌ఐ ఐటీ అండ్ సీ(23), ఎస్‌ఐ పీటీవో(3), ఎస్‌ఐ ఎస్‌ఏఅర్ సీపీఎల్(5), ఏఎస్‌ఐ(ఎఫ్‌బీబీ–8), సైంటిఫిక్ ఆఫీసర్(ఎఫ్‌ఎస్‌ఎల్–14), సైంటిఫిక్ అసిస్టెంట్(ఎఫ్‌ఎస్‌ఎల్–32), ల్యాబ్ టెక్నిషీయన్ (ఎఫ్‌ఎస్‌ఎల్–17), ల్యాబ్ అటెండెంట్(1), ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్స్(390), ఎస్‌ఐ ఎస్‌పీఎఫ్(12)
మొత్తం: 16,587
డీజీపీ ఆఫీస్
హెచ్‌ఓ (59), జూనియర్ అసిస్టెంట్ ఎల్‌సీ(125), జూనియర్ అసిస్టెంట్ టీఎస్‌ఎస్‌పీ(43), సీనియర్ రిపోర్టర్(ఇంటెలిజెన్స్–2), డీజీ ఎస్‌పీఎఫ్ (2)
మొత్తం: 231
రవాణా శాఖ
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌సెక్టర్స్(113), జూనియర్ అసిస్టెంట్ హెడ్ ఆఫీస్(10), జూనియర్ అసిస్టెంట్ ఎల్‌సీ(26)
మొత్తం: 149
వైద్యారోగ్య శాఖ
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమెల్(1520), వైద్య విద్య హెచ్‌ఓడీ: అసిస్టెంట్ ప్రొఫెసర్ (1183), స్టాఫ్ నర్స్ (3823), ట్యూటర్ 357, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్: సివిల్ అసిస్టెంట్ సర్జన్ (751), ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హెచ్‌ఓడీ : సివిల్ అసిస్టెంట్ సర్జన్ (7), ఎంఎస్‌జె క్యాన్సర్ ఆసుపత్రి: స్టాఫ్ నర్స్(81)
తెలంగాణ వైద్య విధాన పరిషత్
సివిల్ అసిస్టెంట్ సర్జన్ (211), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్(బయోకెమిస్ట్రి– 8), సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఈఎన్‌టీ(33), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు ఫోరెన్సిక్ మెడిసిన్ (48), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ జనరల్ మెడిసిన్ (120), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ జనరల్ సర్జరీ(126), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ గైనకాలజీ (147), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ (24), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ మైక్రోబయోలజీ(8), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఆప్తామాలజీ(8), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఆరోథపెడిక్స్(53), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పీడియాట్రిక్స్(142), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ సైక్రియాట్రి(37), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ రేడియోలజీ(42), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ అనస్తీషియా(152), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ డెర్మటాలజీ(9), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పాథలోజీ(78), సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పల్మనరీ మెడిసిన్ (38), మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమెల్/ఎఎన్‌ఎం(265), స్టాఫ్ నర్స్(757)
మొత్తం: 10,028
ఆయుష్ విభాగం హెచ్‌ఓడీ
ఆక్సిలరీ నర్స్ మిడ్–వైఫ్(ఎ ఎన్‌ఎమ్–26), జూనియర్ అసిస్టెంట్ లోకల్(14), జూనియర్ అసిస్టెంట్ స్టేట్(3), ల్యాబ్ అసిస్టెంట్(18), ల్యాబ్ టెక్నీషీయన్ (26), లెక్చరర్ ఆయుర్వేద(29), లెక్చరర్ హోమియో(4), లెక్చరర్ యునాని(12), లైబ్రెరీయన్ (4), మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద(54), మెడికల్ ఆఫీసర్ హోమియో(33), మెడికల్ ఆఫీసర్ యునానీ(88), ఫార్మాస్యూటికల్ కెమిస్ట్(9), ఫార్మాసిస్ట్ ఆయుర్వేద(136), ఫార్మాసిస్ట్ హోమియో(54), ఫార్మాసిస్ట్ యునానీ(118), స్టాఫ్ నర్స్(61)
మొత్తం: 689
డీఎంఈ హెచ్‌ఓడీ
అనస్తీషీయా టెక్నినీషియన్ (93), ఆడియో వీడియో టెక్నినీషియన్ (32), ఆడియో మెట్రీ టెక్నినీషియన్ (18), బయోమెడికల్ ఇంజనీర్(14), బయోమెడికల్ టెక్నీషీయన్ (11), కార్డియోలజీ టెక్నిషీయపన్ (12), సీటీ స్కాన్ టెక్నీషీయరన్ (6), డార్క్ రూమ్ అసిస్టెంట్(36), డెంటల్ హైజెనీస్ట్(3), డెంటల్ టెక్నీషీయన్ (53), ఈసీజీ టెక్నిషీయన్ (4), ఈఈజీ టెక్నీషీయన్ (5), జూనియర్ అసిస్టెంట్ లోకల్(172), ల్యాబ్ టెక్నీషీయన్ గ్రేడ్02(356), ఫార్మాసిస్ట్ గ్రేడ్–2(161), ఫీజియోథెరెపిస్ట్(33), రేడియోగ్రాఫర్(55), రేడియోగ్రఫీ టెక్నీషియన్ (19), ఆప్టోమెటరిస్ట్(20), స్టెరిలైజేషన్ టెక్నీషీయన్ (15)
మొత్తం: 1118
డైరెక్టర్ పబ్లిక్ హెల్త్
అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్(2), డార్క్‌రూమ్ అసిస్టెంట్(30), జూనియర్ అసిస్టెంట్ లోకల్(42), జూనియర్ అసిస్టెంట్ స్టేట్(4), ల్యాబ్ టెక్నీషీయన్ గ్రేడ్–2(119), ఫార్మాసిస్ట్ గ్రేడ్02(160)
మొత్తం: 357
డ్రగ్స్ కంట్రోలర్
డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్(18), జూనియర్ అనాలిస్ట్(9), జూనియర్ అసిస్టెంట్ లోకల్94), జూనియర్ అసిస్టెంట్ స్టేట్ట్(2)
మొత్తం: 33
ఐపీఎమ్(హెచ్‌ఓడీ)
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (24), జూనియర్ అనలిస్ట్ స్టేట్(9), జూనియర్ అనలిస్ట్ జోనల్(2), జూనియర్ అసిస్టెంట్ స్టేట్(1), జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ లోకల్(5), లాబోరేటరీ అటెండెంట్ స్టేట్ క్యాడర్(6), లాబోరేటరీ టెక్నీషీయన్ గ్రేడ్ –2 స్టేట్ క్యాడర్(6), శాంపిల్ టేకర్ లోకల్ క్యాడర్(3)
మొత్తం: 56
ఎమ్‌ఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ అనస్తీషియా 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ గైనిక్ ఆంకాలజీ–2, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పెయిన్ అండ్ పల్లియేటివ్ కేర్–2, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ రేడియో థెరపీ–3, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జికల్ అంకాలజీ–3, బయోమెడికల్ ఇంజనీర్–1, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పాథాలోజీ–1, సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనస్తీషీయా–1, డెంటల్ టెక్నిషీయన్ –1, ఈసీజీ టెక్నీషీయన్ –2, జూనియర్ అసిస్టెంట్ స్టేట్–5, ల్యాబ్ అసిస్టెంట్–8, ల్యాబ్ టెక్నీషీయన్ గ్రేడ్–2(5), లెక్చరర్ ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ –1, మెడికల్ ఫిజిసిస్ట్–5, మెడికల్ రికార్డ్ టెక్నీషీయన్ –3, ఫార్మాసిస్ట్ గ్రేడ్–2(2), రేడియో గ్రాఫర్(సీటీ టెక్నీషీయన్ –2), రేడియోగ్రాఫర్ మమోగ్రఫీ–1, రేడియోగ్రాఫర్ ఎంఆర్‌ఐ టెక్నీషీయన్ –2, రేడియో గ్రాఫర్ ఆర్‌టీ టెక్నీషీయన్ –5, రేడియోగ్రాఫర్స్–6, సోషల్ వర్కర్–6,
మొత్తం: 68
నిమ్స్
జూనియర్ అసిస్టెంట్ స్టేట్–20, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ: ఏఈఈ/ఏఈ(11), జూనియర్ అసిస్టెంట్ స్టేట్–1, జూనియర్ టెక్నీకల్ ఆఫీసర్–1, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్–1,
మొత్తం: 13
వైద్య విధాన పరిషత్
డెంటల్ అసిస్టెంట్ సర్జన్ (36), జూనియర్ అసిస్టెంట్ లోకల్(63), ల్యాబ్ టెక్నీషీయన్ (47), ఫార్మాసిస్ట్ గ్రేడ్–2(119), రేడియోగ్రాఫర్(36)
మొత్తం: 301
కాలోజీ యూనివర్సీటీ
అసిస్టెంట్ ఇంజనీర్/సెక్షన్ ఆఫీసర్–1, అసిస్టెంట్ లైబ్రేరియన్ –2, జూనియర్ అసిస్టెంట్ స్టేట్–1,లైబ్రేరియన్ –1, ప్రోగ్రామర్–1, సీనియర్ సిస్టమ్ అనలిస్ట్–1
మొత్తం 7