Telangana: డీఎస్సీ ఫలితాలు విడుదల
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు సచివాలయంలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు.
By అంజి Published on 30 Sep 2024 7:00 AM GMTTelangana: డీఎస్సీ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు సచివాలయంలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఫైనల్ కీని సెప్టెంబర్ 6న విద్యాశాఖ విడుదల చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ 'టీజీ డీఎస్సీ-2024' పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఎగ్జామ్స్ నిర్వహించారు. మొత్తం 2.45 లక్షల మంది పరీక్షలు రాశారు.
రాష్ట్రంలో 11 వేల 062 టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ మెగా డిఎస్సీ 2024లో మొత్తం 11,062 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2629 ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 727, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 6508, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 182, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు 220, సెకండరీ గ్రేడ్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు 796పోస్టులు ఉన్నాయి. 2017 తర్వాత తెలంగాణలో డిఎస్సీ నియామకాలను 2024లోనే నిర్వహించారు.
#Telangana----Chief Minister Revanth Reddy declared Mega DSC 2024 results today. The recruitment aims to fill 11,062 teacher posts, with 2.45 lakh candidates having appeared for the exams. pic.twitter.com/jjhy7GTHUi
— NewsMeter (@NewsMeter_In) September 30, 2024