స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ అందించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 18,147 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది. గత సంవత్సరం 17,727 కంటే.. ఈ సారి ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎస్‌ఎస్‌సీ జాబ్ క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. మే 21 వరకు దరఖాస్తుల స్వీకరణ జరగనుంది. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వారీగా అదపు విద్యార్హతలు నిర్ణయించారు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ప్రిపేర్ అయితే ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. అభ్యర్థులను టైర్ 1 , టైర్ 2 పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయనున్నారు. టైర్ 1 పరీక్షను 100 ప్రశ్నలు 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. టైర్ 1 పరీక్షలో అర్హత సాధించిన వారికి టైర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. పోస్టులను బట్టి నెలకు రూ.25,000 నుంచి రూ.1,42,400 వరకు నెల జీతం పొందవచ్చు.