త్వరలో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

By అంజి  Published on  22 Aug 2024 10:30 AM IST
SSC, Job Notification

త్వరలో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఎస్‌ఎస్‌సీ వార్షిక క్యాలెండర్‌ 2024 - 25 ప్రకారం ఆగస్టు 27వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ పోస్టులకు డిసెంబర్‌ లేదా జనవరిలో రాత పరీక్ష నిర్వహించనున్నట్టు షెడ్యూల్‌లో పేర్కొంది. గత సంవత్సరం 46,617 కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల కాగా.. ఈ సారి పెద్దమొత్తంలో పోస్టులు ఉండే అవకాశం కనిపిస్తోంది.

ఈ పోస్టులకు 10వ తరగతి పాస్‌ అయిన వారు అర్హులు. వయోపరిమితి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. రాత పరీక్ష, ఫిజికల్‌, ఎఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, వైద్య పరీక్షలు, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా వివిధ సాయుధ బలగాల్లో ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు https://ssc.nic.in/ ను విజిట్‌ చేయండి.

Next Story