13 వేలకు పైగా క్లర్క్ పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే దరఖాస్తు చేసుకోండి

బ్యాంక్ ఉద్యోగం కోసం కలలు కంటున్న అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 13 వేలకు పైగా క్లర్క్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

By Kalasani Durgapraveen  Published on  17 Dec 2024 4:51 AM GMT
13 వేలకు పైగా క్లర్క్ పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే దరఖాస్తు చేసుకోండి

బ్యాంక్ ఉద్యోగం కోసం కలలు కంటున్న అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 13 వేలకు పైగా క్లర్క్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈరోజు, డిసెంబర్ 17, 2024 నుండి ప్రారంభమవుతుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ని సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

విడుదలైన సమాచారం ప్రకారం.. SBI క్లరికల్ కేడర్‌లో 13,735 జూనియర్ అసోసియేట్ పోస్టులపై రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జనవరి 7, 2025 వరకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్ధుల‌కు ఫిబ్రవరి 2025లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ప్రిలిమ్స్ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షకు హాజరు కావాలి. ఇది మార్చి-ఏప్రిల్‌లో జరిగే అవకాశం ఉంది.

SBI విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ద‌ర‌ఖాస్తుదారులు కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అలాగే, విద్యార్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి దరఖాస్తు రుసుము రూ.750 కాగా.. SC/ST/PWBD/XS/DXS కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు.

ఫీజులను డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి చెల్లించవచ్చు. ఈ ఖాళీల‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం.. అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అప్‌డేట్‌లను పొందవచ్చు.

Next Story