రైల్వేలో 5,696 పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తుకు మరో 6 రోజులే గడువు
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్.. భారతీయ రైల్వేకు సంబంధించి ట్రాక్‌మెన్ నుంచి గెజిటెడ్ పోస్టుల వరకూ టెక్నికల్, నాన్-టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టింది.
By అంజి Published on 14 Feb 2024 5:48 AM ISTరైల్వేలో 5,696 పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తుకు మరో 6 రోజులే గడువు
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్.. భారతీయ రైల్వేకు సంబంధించి ట్రాక్‌మెన్ నుంచి గెజిటెడ్ పోస్టుల వరకూ టెక్నికల్, నాన్-టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్‌లకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 21 ఆర్‌ఆర్‌బీల పరిధిలో మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ఆర్‌ఆర్‌బీ- సికింద్రాబాద్ పరిధిలో 758 ఖాళీలున్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో 559 పోస్ట్‌లు, ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 199 పోస్ట్‌లు ఉన్నాయి. అదే విధంగా దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి ఆర్‌ఆర్‌బీ-ముంబై పరిధిలోనూ 26 పోస్ట్‌లను, ఈస్ కోస్ట్ రైల్వే జోన్‌కు సంబంధించి ఆర్‌ఆర్‌బీ-భువనేశ్వర్ పరిధిలో 280 పోస్ట్‌లు ఉన్నాయి. అభ్యర్థులు ఏదో ఒక ఆర్‌ఆర్‌బీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనే రూల్ విధించారు. ఆర్‌ఆర్‌బీ పరిధిలోని జోన్లను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హతలు ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మిల్‌రైట్/మెయింటనెన్స్ మెకానిక్, మెకానిక్ (రేడియో అండ్ టీవీ), మెకానిక్ (మోటార్ వెహికిల్), వైర్‌మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్, మెకానిక్ (డీజిల్), హీట్ ఇంజన్, టర్నరల్, మెకనిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ ట్రేడ్‌లలో ఏదో ఒక ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి (లేదా)-మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లతో డిప్లొమా లేదా బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే వయసు జూలై 1, 2024 నాటికి 18-30 ఏళ్లు ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ వర్గాలకు ఐదేళ్లు, ఓబీసీ(నాన్-క్రీమీ లేయర్) వర్గాలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్‌ల భర్తీకి మూడు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ:ఫిబ్రవరి 19, 2024
ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ: ఫిబ్రవరి 20-29
సీబీటీ-1 పరీక్ష: జూన్-ఆగస్ట్‌లో నిర్వహించే అవకాశం.
సీబీటీ-2 పరీక్ష: సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం
సీబీఏటీ పరీక్ష తేదీ: నవంబర్‌లో నిర్వహించే అవకాశం
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://rrbsecunderabad.gov.in/
ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: https://www.recruitmentrrb.in/#/auth/landing