పోలీస్‌ కానిస్టేబుల్‌ మెయిన్స్‌ ప్రిలిమినరీ కీ విడుదల

పోలీస్‌ కానిస్టేబుల్‌ మెయిన్స్‌ ప్రిలిమినరీ 'కీ'ని తెలంగాణ పోలీస్‌ నియామక మండలి రిలీజ్‌ చేసింది. ఏప్రిల్‌ 30వ తేదీన పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగ

By అంజి  Published on  22 May 2023 9:32 AM IST
Telangana, Police Constable ,Mains Preliminary Key

పోలీస్‌ కానిస్టేబుల్‌ మెయిన్స్‌ ప్రిలిమినరీ కీ విడుదల

పోలీస్‌ కానిస్టేబుల్‌ మెయిన్స్‌ ప్రిలిమినరీ 'కీ'ని తెలంగాణ పోలీస్‌ నియామక మండలి రిలీజ్‌ చేసింది. ఏప్రిల్‌ 30వ తేదీన పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగ అభ్యర్థులకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించారు. సివిల్‌, పీసీ డ్రైవర్‌, మెకానిక్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ఐటీ తదితర తత్సమాన పోస్టులకు సంబంధించిన ఫైనల్‌ పరీక్ష ప్రాథమిక 'కీ'ని ఇవాళ టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ విడుదల చేసింది. ప్రిలిమిననరీ కీ TSLPRB అధికారిక వెబ్‌సైట్‌ https://www.tslprb.in/ లో అందుబాటులో ఉంది. ఈ 'కీ'లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మే 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయాలని చెప్పింది.

అభ్యంతరాలను చెప్పేందుకు ప్రత్యేక ప్రొఫార్మాను కూడా అందుబాటులో ఉంచారు. అభ్యంతరం ఉన్న ఒక్కో ప్రశ్నకు ప్రొఫార్మా ప్రకారం నమోదు చేయాలి. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ అభ్యర్థన అసంపూర్తిగా ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకోరు. కానిస్టేబుల్‌ మెయిన్స్‌ పరీక్షకు 1,09,663 మంది (సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులు) గానూ, 1,08,055 మంది హాజరయ్యారు. ఐటీ అండ్ కమ్యూనికేషన్ అభ్యర్థుల్లో 6,801 మందికి గానూ 6,088 మంది హాజరయ్యారు. మొత్తం 16,969 కానిస్టేబుల్ పోస్టుల కోసం తుది పరీక్షకు 1,75,657 మంది అర్హత సాధించారు.

Next Story