నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్‌బీఐలో 950 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి
RBI Assistant Recruitment 2022 Vacancies for 950 Assistant posts announced.బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి
By తోట వంశీ కుమార్ Published on 15 Feb 2022 7:01 AM GMTబ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. 950 ఆర్‌బీఐ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోనూ పలు ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఫిబ్రవరి 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో తెలిపింది. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 8. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్థానిక బాషలో ప్రావీణ్యత కలిగి ఉండాలి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https://rbi.org.in/ చూడొచ్చు.
ముఖ్యమైన సమాచారం..
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 17ఫిబ్రవరి 2022
అప్లికేషన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08 మార్చి 2022
అప్లికేషన్ ఫీజు : జనరల్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్- రూ. 450, ఎస్సీ/ఎస్టీ/ పీహెచ్/ మాజీ సైనికులు- రూ. 50
ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ: 08 మార్చి 2022
పరీక్ష తేదీ : మార్చి 26, 27 తేదీల్లో నిర్వహిస్తారు.
అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
కేంద్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారం ఆయా కేటగిరిల వాళ్లకు వయసు సడలింపు ఉంటుంది.
అభ్యర్థులు ముందుగా rbi.org.inలో లాగిన్ అవ్వాలి. అక్కడ హోమ్ పేజ్‌లో కనిపించే అప్లికేషన్ ఫర్ 950 అసిస్టెంట్ పోస్ట్స్‌పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత అప్లికేషన్‌లో అడిగిన వివరాలు నింపాలి. ముఖ్యమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ నింపడం పూర్తైన తర్వాత ఫీజు పే చేసే ఆఫ్షన్‌పై క్లిక్ చేసి చెల్లింపులు పూర్తి చేయాలి. తర్వాత అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం ఓ కాపీ ప్రింట్ తీసిపెట్టుకోవాలి.