గ్రూప్‌-4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. మళ్లీ ఎప్పటినుంచంటే?

Postponement of Processing of Group 4 Applications in Telangana. తెలంగాణ నిరుద్యోగులకు బ్యాడ్‌ న్యూస్. నేటి నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభం కావాల్సిన గ్రూప్‌-4

By అంజి  Published on  23 Dec 2022 5:31 AM GMT
గ్రూప్‌-4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. మళ్లీ ఎప్పటినుంచంటే?

తెలంగాణ నిరుద్యోగులకు బ్యాడ్‌ న్యూస్. నేటి నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభం కావాల్సిన గ్రూప్‌-4 ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ వాయిదా పడింది. పలు టెక్నికల్‌ కారణాలతో దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేసినట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. అయితే దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన తదుపరి తేదీలను వెల్లడించింది. డిసెంబర్‌ 30వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు గ్రూప్‌-4 దరఖాస్తులను స్వీకరిస్తామని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. అప్లికేషన్లు సమర్పించుకునేందుకు మూడు వారాల సమయం ఇచ్చింది.

గ్రూప్‌-4 పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుందని ఇప్పటికే కమిషన్‌ వెల్లడించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 25 ప్ర‌భుత్వ విభాగాల్లో 9,168 పోస్టుల‌కు టీఎస్పీఎస్సీ నోటిఫికేష‌న్ జారీ చేసింది. గ్రూప్‌-4 ఉద్యోగాల్లో ప్ర‌ధానంగా నాలుగు కేట‌గిరీల‌కు సంబంధిన పోస్టులున్నాయి. 429 జూనియ‌ర్ అకౌంటెంట్ పోస్టులు, 6,859 జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులు, 18 జూనియ‌ర్ ఆడిట‌ర్ పోస్టులు, 1,862 వార్డు ఆఫీస‌ర్ పోస్టులు.

చాలా రోజుల తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తున్నందు.. గ్రూప్‌-4 ఉద్యోగాల‌కు భారీ సంఖ్య‌లో ద‌ర‌ఖాస్తులు వ‌స్తాయ‌ని టీఎస్పీఎస్సీ అంచ‌నా వేస్తోంది. కనీసం 6 లక్షలకుపైగా అప్లికేష‌న్లు రావొచ్చు అని భావిస్తోంది. 2018లో 700 వీఆర్ఓ పోస్టుల‌కు దాదాపు 10ల‌క్ష‌ల మందికిపైగా ద‌ర‌ఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం 9 వేల‌కు పైగా పోస్టులు ఉండ‌డంతో పెద్ద సంఖ్య‌లో అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకునే ఛాన్స్‌ ఉంది. ఇక తర్వలోనే గ్రూప్‌-2, 3 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది.

Next Story