దేశీయ కంపెనీల్లో కూడా ఉద్యోగుల తొలగింపులు మొదలయ్యాయి. తాజాగా ఓయో సంస్థ సైతం ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. టెక్నాలజీ, కార్పొరేట్ విభాగానికి చెందిన 600 మంది ఉద్యోగులను తొగించబోతున్నట్టు తెలిపింది. ఇదే సమయంలో రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ టీమ్ లోకి కొత్తగా 250 మందిని తీసుకోనున్నట్టు వెల్లడించింది. తొలగించిన ఉద్యోగులకు 3 నెలల పాటు మెడికల్ ఇన్స్యూరెన్స్ కొనసాగుతుందని.. భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు చేపడితే తొలగించిన ఉద్యోగులకు ప్రాధాన్యతను ఇస్తామని పేర్కొంది.
డిసెంబర్ నెలలో ఓయో సంస్థ ఉత్పత్తి, ఇంజనీరింగ్, కార్పొరేట్ ప్రధాన కార్యాలయం, ఒయో వెకేషన్ హోమ్స్ టీంలలో భాగమైన సుమారు 600 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఓయోలో ప్రస్తుతం 3,700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 10శాతం ఉద్యోగులు ఇంటిబాట పట్టనున్నారు. 600 మంది ఉద్యోగులను తొలగిస్తున్న ఓయో.. సేల్స్ విభాగంలో కొత్తగా 250 మందిని రిక్రూట్ మెంట్ చేసుకోనున్నట్లు తెలిపింది. ఓయో గ్రూప్ సీఈఓ, వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. మేం తొలగిస్తున్న ఉద్యోగుల్లో చాలా మందికి ఉపాధి పొందేలా తమ వంతు కృషి చేస్తామని అన్నారు.