2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కోర్టుల్లో 1620 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఈ నెల 13 వ తేదీ నుంచి జూన్‌ 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

By అంజి
Published on : 8 May 2025 8:28 AM IST

Job Notifications ,  job vacancies, IDBI Bank, District Courts, Andhra Pradesh

2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కోర్టుల్లో 1620 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఈ నెల 13 వ తేదీ నుంచి జూన్‌ 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫీస్‌ సబార్డినేట్‌ 651, జూనియర్‌ అసిస్టెంట్‌ 230, కాపీయిస్ట్‌ 193, ప్రాసెస్‌ సర్వర్‌ 164, టైపిస్ట్‌ 162, స్టెనోగ్రాఫర్‌ 80, ఫీల్డ్ అసిస్టెంట్‌ 56, ఎగ్జామినర్‌ 32, డ్రైవర్‌ 28, రికార్డు అసిస్టెంట్‌ 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టును బట్టి ఏడోవ తరగతి నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు అని అధికారులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు https://aphc.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే.. ఐడీబీఐ బ్యాంక్‌ 676 అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నేటి నుంచి 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు డిగ్రీ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయస్సు 25 సంవత్సరాలుగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ మినహాయింపు ఉండనుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

Next Story