Telangana: త్వరలోనే 3 వేల పోస్టులకు నోటిఫికేషన్
తెలంగాణలోని ఎనిమిది వైద్య కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
By అంజి Published on 22 Sept 2024 6:41 AM ISTTelangana: త్వరలోనే 3 వేల పోస్టులకు నోటిఫికేషన్
తెలంగాణలోని ఎనిమిది వైద్య కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే 3 వేలకుపైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. వీటితో పాటు ఏటూరు నాగారం ఫైర్ స్టేషన్‌కు 34 సిబ్బంది మంజూరు కోస్గిలో ఇంజినీరింగ్ కాలేజీ, హకీంపేటలో జూనియర్ కాలేజీ మంజూరుకు పచ్చ జెండా ఊపింది. రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు పూర్తి చేసేలా రూ.4637 కోట్లు మంజూరు చేసింది. అటు అక్టోబర్ నుంచి కొత్త తెల్ల రేషన్ కార్డులను జారీ చేస్తామని తెలిపింది. ఖమ్మం జిల్లాలో 58 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం వైద్య, విద్యరంగాలకు పెద్దపీట వేసింద మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం నాడు నర్సంపేటలో నూతన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అండ్ జనరల్ ఆస్పత్రిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మరో మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి రాజనర్సింహ మాట్లాడారు. ఏ ప్రభుత్వానికైనా మొదటి ప్రాధాన్యంగా విద్య, వైద్యం అయి ఉండాలని, అవి అమలుచేసే దిశగా రేవంత్ సర్కారు నిరంతరం కృషి చేస్తోందన్నారు. అటు ఈ ఏడాది తెలంగాణకు 8 వైద్య కాలేజీలు మంజూరు అయిన విషయం తెలిసిందే.