ఎన్ఎఫ్ఎల్‌లో 336 ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..!
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) లో పలు ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు
By M.S.R Published on 14 Oct 2024 11:31 AM ISTనేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) లో పలు ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. వివిధ యూనిట్లు, కార్యాలయాల్లో నాన్-ఎగ్జిక్యూటివ్ (వర్కర్) స్థాయి ఉద్యోగాల నియామకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ careers.nfl.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ విండో నవంబర్ 8, 2024 వరకు తెరిచి ఉంటుంది.
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఎరువులు, ఇతర వ్యవసాయ ఇన్‌పుట్‌ల తయారీ, మార్కెటింగ్‌లో ఈ సంస్థ భాగంగా ఉంటుంది. NFL ఐదు గ్యాస్ ఆధారిత అమ్మోనియా-యూరియా ప్లాంట్‌లను నిర్వహిస్తోంది. పంజాబ్‌లోని నంగల్ & బటిండా యూనిట్లు, హర్యానాలోని పానిపట్ యూనిట్, మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలోని విజయపూర్ యూనిట్ లో కీలక ఉద్యోగాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. రిజిస్ట్రేషన్ చివరి తేదీ నవంబర్ 8, 2024 కాగా.. అప్లికేషన్లను ఎడిట్ చేసుకోడానికి నవంబర్ 10, నవంబర్ 11 తేదీల్లో అవకాశం ఉంటుంది.
NFL రిక్రూట్‌మెంట్ 2024: ఖాళీల వివరాలు
అకౌంట్స్ అసిస్టెంట్
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ II (ప్రొడక్షన్)
అటెండెంట్ గ్రేడ్ I (మెకానికల్) - ఫిట్టర్
అటెండెంట్ గ్రేడ్ I (మెకానికల్) - వెల్డర్
అటెండెంట్ గ్రేడ్ I (మెకానికల్) - ఆటో ఎలక్ట్రీషియన్
అటెండెంట్ గ్రేడ్ I (మెకానికల్) - డీజిల్ మెకానిక్
అటెండెంట్ గ్రేడ్ I (మెకానికల్) - టర్నర్
అటెండెంట్ గ్రేడ్ I (మెకానికల్) - మెషినిస్ట్
అటెండెంట్ గ్రేడ్ I (మెకానికల్) - బోరింగ్ మెషిన్
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ II (మెకానికల్)
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ II (ఇన్‌స్ట్రుమెంటేషన్)
అటెండెంట్ గ్రేడ్ I (ఎలక్ట్రికల్)
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ II (ఎలక్ట్రికల్)
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ II (కెమికల్ ల్యాబ్)
స్టోర్ అసిస్టెంట్
లోకో అటెండెంట్ గ్రేడ్ III
లోకో అటెండెంట్ గ్రేడ్ II
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ II (మెకానికల్) - డ్రాఫ్ట్స్‌మన్
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ II (NDT)
నర్స్
ఫార్మసిస్ట్
ల్యాబ్ టెక్నీషియన్
ఎక్స్-రే టెక్నీషియన్
OT టెక్నీషియన్
అటెండెంట్ గ్రేడ్ I (ఇన్‌స్ట్రుమెంటేషన్)
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ careers.nfl.co.in పై క్లిక్ చేయండి.