10వ తరగతి పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా.? లాస్ట్ డేట్ రేపే.. అప్లై చేసుకోండి..!

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) గ్రూప్ సి కింద ఆఫీస్ అటెండెంట్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ చేస్తోంది.

By Kalasani Durgapraveen  Published on  20 Oct 2024 9:51 AM GMT
10వ తరగతి పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా.? లాస్ట్ డేట్ రేపే.. అప్లై చేసుకోండి..!

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) గ్రూప్ సి కింద ఆఫీస్ అటెండెంట్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ చేస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి రేపు చివరి తేదీ అంటే 21 అక్టోబర్ 2024. 10వ తరగతి ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nabard.orgని సందర్శించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను వెంటనే పూర్తి చేయవచ్చు. రేపటితో అప్లికేషన్ విండో మూసివేయబడుతుంది.

NABARD ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి.. అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ/మెట్రిక్యులేషన్ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. గరిష్ట వయస్సు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. రిజర్వేషన్ కేటగిరీ నుండి వచ్చే అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు ఇవ్వబడుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి

1.ఈ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేయ‌డానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ nabard.orgకి వెళ్లండి.

2.వెబ్‌సైట్‌లోని రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయండి.

3. రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేసి, అవసరమైన వివరాలను పూరించడం ద్వారా నమోదు చేసుకోవాలి.

4. ఇతర వివరాలు, సంతకం, ఫోటోగ్రాఫ్ అప్‌లోడ్ చేయాలి.

5. నిర్ణీత రుసుమును డిపాజిట్ చేయాలి.

6. అభ్యర్థులు పూర్తిగా నింపిన ఫారమ్‌ను ప్రింటవుట్ తీసుకొని తమ వద్ద భద్రంగా ఉంచుకోవాలి.

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీల దరఖాస్తు రుసుము రూ.50 మాత్రమే ఉంటుంది.

ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎంపిక కావడానికి అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్ పరీక్ష ద్వారా వెళ్లాలి. ఆన్‌లైన్ పరీక్షలో 120 మల్టిపుల్ చాయిస్ తరహా ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులకు ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు, ప్రతి తప్పు సమాధానానికి మైనస్ మార్కు 1/4 ఇవ్వబడుతుంది. రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగం నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. ఆన్‌లైన్ పరీక్షలో అర్హ‌త మార్కులను పొందిన అభ్యర్థులు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో హాజరు కావాలి.


Next Story