శుభవార్త.. ఈ ఏడాది ఫ్రెషర్‌లకు మరిన్ని ఉద్యోగాలు.!

Jobs alert.. More jobs for freshers this year. భారతదేశంలోని ఉద్యోగార్ధులకు శుభవార్త. ఈ సంవత్సరం మరిన్ని కంపెనీలు ఫ్రెషర్లను నియమించుకోవడానికి ప్లాన్ చేస్తున్నాయి.

By అంజి  Published on  18 Feb 2022 8:24 AM IST
శుభవార్త.. ఈ ఏడాది ఫ్రెషర్‌లకు మరిన్ని ఉద్యోగాలు.!

భారతదేశంలోని ఉద్యోగార్ధులకు శుభవార్త. ఈ సంవత్సరం మరిన్ని కంపెనీలు ఫ్రెషర్లను నియమించుకోవడానికి ప్లాన్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా సర్వే చేసిన 47 శాతం కంపెనీలు ఫ్రెషర్లను నియమించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాయి. ఇది గ్లోబల్ యావరేజ్ అయిన 7 శాతం కంటే ఎక్కువ అని టీమ్‌లీజ్ ఎడ్‌టెక్‌ పేర్కొంది.

ఐటి, టెలికాం, ఇ-కామర్స్ లీడ్ చార్ట్

ఫ్రెషర్‌లను నియమించుకోవాలనే యజమానుల ఉద్దేశం జూలై-డిసెంబర్ 2021లో 17 శాతం నుండి 2022 జనవరి నుండి జూన్ వరకు 47 శాతానికి పెరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్, ఇ-కామర్స్ మరియు టెక్నాలజీ స్టార్టప్‌లు ఫ్రెషర్‌లను నియమించుకోవడానికి ఉద్దేశించిన మొదటి మూడు రంగాలు.

బెంగుళూరు, ముంబై, ఢిల్లీ టాప్ డెస్టినేషన్స్

నగరాల్లో బెంగళూరు, ముంబై, ఢిల్లీలో జనవరి-జూన్ 2022 కాలంలో ఫ్రెషర్‌లకు మరిన్ని ఉద్యోగాలు ఉంటాయి. గుర్గావ్, పూణే, చండీగఢ్, ఇండోర్, నాగ్‌పూర్ వంటి నగరాల్లో ఫ్రెషర్‌ల నియామకం తగ్గిపోయింది. కానీ నియామక ఉద్దేశం 31 శాతానికి పెరుగుతుందని అంచనా వేయబడింది. ఇది కరోనా మహమ్మారి తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ప్రత్యక్ష ప్రతిబింబం అని ట్యాగ్డ్ నివేదిక తెలిపింది. 2022లో దాదాపు 56 శాతం మంది కొత్త నియామకాలు 0-5 సంవత్సరాల అనుభవంతో ప్రారంభ కెరీర్ నిపుణులుగా భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,మెషిన్ లెర్నింగ్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైన్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ వంటి అత్యధిక డిమాండ్ నైపుణ్యాలు ఉన్నాయి.

Next Story