గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి
భారతదేశంలో గ్రామీణ ఆర్థికాభివృద్ధి కోసం స్థాపించబడిన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs), సాధారణ ప్రజలకు సులభంగా బ్యాంకింగ్ సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
By అంజి
గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి
భారతదేశంలో గ్రామీణ ఆర్థికాభివృద్ధి కోసం స్థాపించబడిన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs), సాధారణ ప్రజలకు సులభంగా బ్యాంకింగ్ సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఈ బ్యాంకుల్లో సిబ్బంది నియామకాన్ని ఐబీపీఎస్ నిర్వహిస్తుంది. ఈ సారి CRP RRBs XIV నోటిఫికేషన్ ద్వారా 13,217 ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూలు, ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ద్వారా ఈ నియామకం జరుగుతుంది. ఆఫీసర్స్ స్కేల్ -1, ఆఫీస్ అసిస్టెంట్స్ పోస్టులకు రెండు దశల్లో పరీక్షలు (ప్రిలిమినరీ, మెయిన్స్) నిర్వహించబడతాయి.
ఆఫీసర్స్ స్కేల్-2, స్కేల్-3 పోస్టులకు మాత్రం ఒకే దశలో ఆన్‌లైన్ పరీక్ష జరుగుతుంది. ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3 అభ్యర్థులకు ప్రధాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఏదైనా డిగ్రీ (కొన్ని పోస్టులకు స్పెషలైజ్డ్ డిగ్రీ అవసరం) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి సెప్టెంబర్ 1 నాటికి ఆఫీస్ అసిస్టెంట్‌కు 18 నుంచి 28 ఏళ్ల మధ్య, ఆఫీసర్ స్కేల్ -1 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య, ఆఫీసర్ స్కేల్ 2 పోస్టులకు 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 1వ తేదీన మొదలైంది. సెప్టెంబర్ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాథమిక పరీక్షలు నవంబర్ - డిసెంబర్ 2025లో, ప్రధాన పరీక్షలు డిసెంబర్ 2025 నుండి ఫిబ్రవరి 2026లో నిర్వహించబడతాయి. ఆఫీసర్స్ పోస్టుల ఇంటర్వ్యూ జనవరి - ఫిబ్రవరి 2026లో జరుగుతాయి. తుది ఫలితాలు, ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఫిబ్రవరి - మార్చి 2026లోప్రకటించబడతాయి. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వారికి రూ.175, ఇతరులకు రూ.850. WWW.ibps.in లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.