16,347 టీచర్ పోస్టులు.. హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న మెగా డీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి.
By అంజి
16,347 టీచర్ పోస్టులు.. హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
అమరావతి: 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న మెగా డీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6వ తేదీ నుంచి జులై 6 వరకు రోజుకు రెండు సెషన్లలో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వారం ముందుగానే 30వ తేదీ వరకు పరీక్షలు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు డీఎస్సీ కన్వీనర్ కృష్ణారావు తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు జరుగుతాయి.
హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం
- అధికారిక AP DSC పోర్టల్‌ను సందర్శించండి: https://apdsc.apcfss.in
- హోమ్‌పేజీలో "డౌన్‌లోడ్ హాల్ టికెట్" లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి.
- మీ హాల్ టికెట్‌ను యాక్సెస్ చేయడానికి “సమర్పించు” పై క్లిక్ చేయండి.
- హాల్ టికెట్ PDF ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాల్సిన పత్రాలు
- ఏపీ డీఎస్సీ 2025 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఈ క్రింది పత్రాలను తీసుకెళ్లాలి.
- ఏపీ డీఎస్సీ అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) హార్డ్ కాపీ
- రెండు ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
- ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ID. ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్.