గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ Inc దాదాపు 12,000 ఉద్యోగులను తొలగించే దిశగా అడుగులు వేస్తోంది. సంస్థలో 6% మందిని తొలగిస్తున్నట్లు కంపెనీ శుక్రవారం తెలిపింది. గూగుల్ CEO స్టాక్ మెమోలో కంపెనీ ఆల్ఫాబెట్ 12000 మందిని తొలగించబోతున్నట్లు చెప్పారు. గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 6 శాతం కంటే ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలపై కోతలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ లేఆఫ్ వల్ల అమెరికాలోని గూగుల్ ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మెటా, ట్విట్టర్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తొలగించాయి.
మైక్రోసాఫ్ట్ కార్ప్ 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తామని చెప్పిన కొన్ని రోజుల తర్వాత ఆల్ఫాబెట్ Inc కోతలను విధించింది. ఆల్ఫాబెట్ ఇప్పటికే బాధిత ఉద్యోగులకు ఇమెయిల్ చేసింది. వర్క్‌ఫోర్స్‌ను సుమారు 12వేల మందిని తొలగిస్తున్నామనే బాధాకరమైన నిర్ణయాన్ని వెల్లడించడం కష్టంగా ఉందని.. కష్టపడి పనిచేసే అద్భుతమైన ప్రతిభావంతులకు వీడ్కోలు పలుకుతున్నందుకు చాలా విచారిస్తున్నానని.. ఉద్యోగులకు ప్రత్యేక ఇమెయిల్‌ను పంపాం అని పిచాయ్ తన ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.