నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఏపీపీఎస్సీ గ్రూప్‌-4 ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు

Good news to Unemployed APPSC Extends application deadline of Group 4.ఏపీపీఎస్సీ నిరుద్యోగుల‌కు మ‌రోసారి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jan 2022 2:48 AM GMT
నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఏపీపీఎస్సీ గ్రూప్‌-4 ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు

ఏపీపీఎస్సీ నిరుద్యోగుల‌కు మ‌రోసారి శుభ‌వార్త చెప్పింది. ఇటీవ‌లే ఇచ్చిన గ్రూప్‌-4 ఉద్యోగాల ద‌ర‌ఖాస్తు గ‌డువును మ‌రోసారి పెంచింది. నేటితో ద‌ర‌ఖాస్తు గ‌డువు ముగియ‌నుండ‌గా.. మ‌రికొంత స‌మ‌యం కావాల‌ని నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున విన‌తులు వ‌చ్చాయి. అభ్య‌ర్థులు విజ్ఞ‌ప్తి చేయ‌డంతో నేటితో ముగియాల్సిన గ‌డువును ఫిబ్ర‌వ‌రి 6 వ‌ర‌కు పెంచారు. దీంతో రెవెన్యూ డిపార్టుమెంట్‌లోని జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు ఆన్‌లైన్‌లో ఫిబ్ర‌వ‌రి 6 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

గ్రూప్‌-4 ఉద్యోగాల ద‌ర‌ఖాస్తు గ‌డువును ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లు పెంచింది. తొలుత ఇచ్చిన నోటిఫికేష‌న్ ప్ర‌కారం జ‌న‌వ‌రి 19 న ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ కాగా.. దాన్ని జ‌న‌వ‌రి 29 వ‌ర‌కు పెంచారు. మ‌రోసారి నిరుద్యోగుల నుంచి వ‌చ్చిన విజ్ఞ‌ప్తుల మేర‌కు ఫిబ్ర‌వ‌రి 6 వ‌ర‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది ఏపీపీఎస్సీ. నిరుద్యోగ అభ్యర్ధులు ఆయా పోస్టుల‌కు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 42 ఏళ్లలోపు వయసున్న అభ్యర్ధులు అర్హులు. మొత్తం 670 పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు.

Next Story