ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో డిస్ క్వాలిఫై అయిన అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌

Good News to Aspirants who Disqualified in Police Recruitment Events.ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో ఉత్తీర్ణ‌త కాలేని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Feb 2023 5:05 AM GMT
ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో డిస్ క్వాలిఫై అయిన అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌

ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో ఉత్తీర్ణ‌త కాలేని అభ్య‌ర్థుల‌కు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) శుభవార్త చెప్పింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిర్ధేశిత ఎత్తు కంటే 1 సెం.మీ లేదా అంతకన్నా తక్కువ కలిగి ఉన్నారన్న కారణంతో డిస్ క్వాలిఫై అయిన వారికి మ‌రోసారి అవ‌కాశం క‌ల్పించింది. వీరు ఈ నెల 10వ తేదీ ఉద‌యం 8 నుంచి నుంచి 12వ తేదీ రాత్రి 8 గంట‌ల్లోపు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది.

ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి హైద‌రాబాద్‌లోని అంబ‌ర్‌పేట‌, ఎస్ఏఆర్ సీపీఎల్‌, కొండాపూర్‌లోని 8వ బెటాలియ‌న్ మైదానాల్లో ఎత్తు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. త్వ‌రలోనే ఇందుకు సంబంధించిన తేదీల‌ను వెల్ల‌డించ‌నున్నారు. అభ్య‌ర్థులు ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు అయ్యే స‌మ‌యంలో ద‌ర‌ఖాస్తు ప‌త్రాన్ని వెంట తీసుకుని రావాల్సి ఉంటుంద‌ని మండ‌లి ఛైర్మ‌న్ వి.వి.శ్రీనివాస్ రావు తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో 7 ప్రశ్నలకు సంబంధించి మార్కులను కలపాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఇప్ప‌టికే అమ‌లు చేసింది. మార్కుల‌ను క‌లప‌డం ద్వారా ఉత్తీర్ణ‌త సాధించిన అభ్య‌ర్థుల జాబితాను వైబ్‌సైట్‌లో పొందుప‌రిచిన సంగ‌తి తెలిసిందే.

Next Story