నిరుద్యోగులకు తీపికబురు..లక్షకు పైగా జీతంతో కాంట్రాక్ట్ బేస్డ్ పోస్టులకు నోటిఫికేషన్

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తీపి కబురు చెప్పింది.

By Knakam Karthik
Published on : 27 April 2025 8:45 PM IST

Employment News, Unemployees, Contract Based Jobs, National Mineral Development Corporation

నిరుద్యోగులకు తీపికబురు..లక్షకు పైగా జీతంతో కాంట్రాక్ట్ బేస్డ్ పోస్టులకు నోటిఫికేషన్

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తీపి కబురు చెప్పింది. ఇందులో భాగంగానే కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఇటీవల నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(NMDC) స్టీల్ లిమిటెడ్ 934 కాంట్రాక్ట్ బెస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, బీఈ, డిప్లొమా, ఐటీఐ, పీజీ, సీఏ, ఎంఏ, ఎంబీఏ/పీజీడీఎం ఉత్తీర్ణత సాధించి, పని అనుభవం ఉండాలి.

50 ఏళ్ల లోపు వయసు వారు అర్హులు గా పేర్కొంది. భుమనేశ్వర్, దుర్గాపూర్ తదితర ప్రాంతాల్లో వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. పోస్టును బట్టి నెలకు రూ.40,000-1.7లక్షల వరకు జీతం ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్https://www.nmdc.co.in/careers సందర్శించండి. దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులకు, మాజీ సైనికుల వర్గాలకు చెందిన వారు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి గడువు వచ్చే నెల(మే) 8వ తేదీ వరకు ప్రకటించారు.

Next Story