Telangana: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. 11,062 టీచర్‌ పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది.

By అంజి  Published on  29 Feb 2024 11:46 AM IST
CM Revanth, Mega DSC notification, Telangana

 Telangana: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. 11,062 టీచర్‌ పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డి తన నివాసంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. రిలీజైన నోటిఫికేషన్‌లో ఎస్జీటీలు 6,508, స్కూల్‌ అసిస్టెంట్లు 2,629, ఎల్‌పీలు 727, పీఈటీలు 182 ఉన్నాయి. దీంతో పాటు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కేటగిరీలో 220 ఎస్‌లు, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. గత ఏడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టులను అదనంగా పెంచి తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చింది

Next Story