దేశ వ్యాప్తంగా సీబీఎస్‌ఈసీటెట్ పరీక్షను ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహిస్తోంది. సీటెట్‌కు సంబంధించిన దరఖాస్తులు సెప్టెంబర్ 17 నుండి స్వీకరిస్తున్నారు. సీటెట్‌లో సాధించిన స్కోరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే పాఠశాలల ఉపాధ్యాయ నియామకాలను చేపడతారు. ఒకసారి సీటెట్ పరీక్షలో అర్హత సాధించిన స్కోరు వారికి జీవిత కాలం వ్యాలిడిటీ ఉంటుంది. దీనికి సంబంధించిన పరీక్ష కేంద్రాలు దేశ వ్యాప్తంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలలో పరీక్ష కేంద్రాలను సీబీఎస్‌ఈ బోర్డు ఏర్పాటు చేసింది. ఇందులో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. 1- 5వ తరగతి వరకు విద్యాబోధన చేయాలనుకునే అభ్యర్థులు పేపర్ - 1 పరీక్ష రాయాలి. 6 - 9వ తరగతి వరకు భోదన చేసే అభ్యర్థులు పేపర్ - 2 పరీక్ష రాయాలి.
పేపర్ - 2 ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ - 1 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఒకసారి అప్లికేషన్‌ను పూర్తిగా ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. ఒకసారి అప్లికేషన్‌ను ఆన్‌లైన్‌లో పొందుపరిచిన తర్వాత ఏమైనా తప్పులు గుర్తిస్తే అక్టోబర్ 21 - 25 తేదీల మధ్య సవరణలు చేసుకునే అవకాశం కల్పిస్తారు. సీటెట్ హాల్‌టికెట్లను పరీక్షకు రెండ్రోజుల ముందు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఎగ్జామ్ రిజల్ట్స్ జనవరి నెలాఖరు వరకు విడుదల చేస్తారు. సీటెట్ ఎగ్జామ్‌కు సంబంధించిన సమాచారం కోసం https://ctet.nic.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.