టెన్త్ అర్హత గల తెలంగాణకు చెందిన యువత ఆర్మీలో చేరడానికి మంచి అవకాశం లభించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో డిసెంబర్ 8 నుంచి 16వ తేదీ వరకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ చేపట్టనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అగ్నివీర్ ట్రేడ్‌మెన్ ఉద్యోగాలకు 8వ తరగతి ఉత్తీర్ణత ఉంటే చాలు.
తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన మహిళా మిలటరీ పోలీస్ అభ్యర్థులు ఈ ఏడాది ఫిబ్రవరి 12న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ర్యాలీ జరిగే దగ్గరికి అన్ని డాక్యుమెంట్లను తీసుకురావాలని సూచించింది. ఈ నియామకాలు పూర్తి పారదర్శకంగా జరుగుతాయని అధికారులు తెలిపారు. కొందరు కేటుగాళ్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేయవచ్చని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.