నిరుద్యోగులకు శుభవార్త..టెన్త్ అర్హతతో ప్రభుత్వ రంగ సంస్థలో అప్రెంటిస్‌

యంత్ర ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీలలో ట్రేడ్ అప్రెంటిస్‌ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

By -  Knakam Karthik
Published on : 5 Feb 2026 6:51 AM IST

Employement News, Apprentice Notification, Yantra India Ltd, Central Government

నిరుద్యోగులకు శుభవార్త..టెన్త్ అర్హతతో ప్రభుత్వ రంగ సంస్థలో అప్రెంటిస్‌

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన యంత్ర ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీలలో ట్రేడ్ అప్రెంటిస్‌ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3,979 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసినవారు ఈ పోస్టులకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలవారీ స్టైఫండ్ అందిస్తారు. ఈ శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలు అభ్యర్థులకు లభిస్తాయని వైఐఎల్ అధికారులు చెబుతున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

3,979. (ఇందులో ఎక్స్ ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు 2,843 ఉండగా.. నాన్ ఐటీఐ (10వ తరగతి) అప్రెంటిస్ పోస్టులు 1,136 ఉన్నాయి.) ఎంపికైనవారికి ఆర్డినెన్స్, ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో శిక్షణ ఇస్తారు. మహారాష్ట్ర (Maharashtra), మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఒడిశా, బిహార్, చండీగఢ్ వంటి రాష్ట్రాల్లో శిక్షణ కేంద్రాలున్నాయి. ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, కార్పెంటర్, ప్లంబర్, సీఎస్‌సీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, సెక్రటేరియల్ అసిస్టెంట్ వంటి అనేక ప్రధాన ట్రేడ్‌లలో అప్రెంటిస్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి.

విద్యార్హతలు:

నాన్ ఐటీఐ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇందులో గణితం, సైన్స్ సబ్జెక్ట్‌లలో కనీసం 40 శాతం మార్కులు తప్పనిసరి. ఎక్స్ ఐటీఐ అభ్యర్థులు ఎన్‌సీవీటీ లేదా ఎస్‌సీవీటీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. అలాగే పదో తరగతిలో కనీసం 50 శాతం మార్కులు అవసరం.

వయోపరిమితి:

ఈ ఏడాది మార్చి 03 నాటికి కనీస వయసు 14 ఏళ్లు కాగా ప్రమాదకర వృత్తులకు 18 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా 35 ఏళ్ల వయసువారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీవోడబ్ల్యూడీ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

స్టైపెండ్ : ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ. 8,200 నుంచి రూ. 9,600 వరకు స్టైపెండ్ ఇస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..

దరఖాస్తు గడువు : మార్చి 03.

దరఖాస్తు ఫీజు : అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ అభ్యర్థులకు రూ.200 (జీఎస్టీ అదనం).

ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూవోడీ, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.100 (జీఎస్టీ అదనం).

ఎంపిక ప్రక్రియ:

ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ఈ ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. నాన్ ఐటీఐ అప్రెంటిస్ పోస్టులకు పదో తరగతి మార్కుల ఆధారంగా, ఎక్స్ ఐటీఐ అప్రెంటిస్‌కు పదో తరగతితోపాటు ఐటీఐ మార్కుల సగటు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫ్యాక్టరీ వారీగా, ట్రేడ్ వారీగా ఎంపిక చేసిన అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు ఉంటాయి. పూర్తి వివరాల కోసం https://recruit-gov.com లేదా yantraindia.co.in వెబ్‌సైట్‌లలో సంప్రదించగలరు.

Next Story