ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ ) ఫలితాలను పాఠశాల విద్యా శాఖ గురువారం ప్రకటించింది. అభ్యర్థులు పరీక్షలో పొందిన మార్కులను చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ APTET aptet.apcfss.inను చూడాలని సూచించారు. ఆగస్టు 6 నుండి ఆగస్టు 21, 2022 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష నిర్వహించబడింది. ఈ పరీక్షకు 5,25,789 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా మొత్తం 4.07,329 మంది హాజరయ్యారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, PHC, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు అర్హత పరీక్ష మార్కులను నార్మలైజేషన్ పద్ధతి ద్వారా అమలు చేశారు.
సెప్టెంబరు 14న విడుదల చేయాల్సిన ఫలితాలు విద్యాశాఖ నిర్ణీత తేదీలో మాత్రమే కీని విడుదల చేయడంతో వాయిదా పడింది. 2018 తర్వాత, ఏపీ టెట్‌కు ఈ సంవత్సరం భారీ సంఖ్యలో అభ్యర్థులతో పరీక్షకు హాజరయ్యారు. ఈ టెట్ పరీక్షల్లో 58.07% మంది అర్హత సాధించినట్లు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
. మొదటగా aptet.apcfss.in అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి
. హోమ్ పేజీలో AP TET 2022పై క్లిక్ చేయండి
. అనంతరం అడిగిన అభ్యర్థి వివరాలను నమోదు చేయండి
. మీ రిజల్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీని ప్రింట్ అవుట్ తీసుకుని మీ వద్ద పెట్టుకోండి