16,347 ఉద్యోగాలు.. అభ్యర్థులకు బిగ్ అలర్ట్
మెగా డీఎస్సీకి సంబంధించి అభ్యర్థుల మెరిట్ లిస్టు రేపు విడుదల అయ్యే అవకాశం ఉంది.
By అంజి
16,347 ఉద్యోగాలు.. అభ్యర్థులకు బిగ్ అలర్ట్
మెగా డీఎస్సీకి సంబంధించి అభ్యర్థుల మెరిట్ లిస్టు రేపు విడుదల అయ్యే అవకాశం ఉంది. టెట్ మార్కులపై అభ్యంతరాల స్వీకరణ, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన లిస్టు రావడంతో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి జాబితా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేస్తుండగా.. అంతే సంఖ్యలో వెరిఫికేషన్‌కు పిలవనున్నట్టు సమాచారం. ఆ తర్వాతే తుది జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
ఈ నెల 21 లేదా 22 నుంచి ప్రతిభ చూపిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన విద్యాశాఖ.. టెట్ మార్కుల సవరణకు ఆదివారం వరకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన టెట్ మార్కులను పరిశీలించి, అనంతరం స్కోర్ కార్డులను రిలీజ్ చేసింది. అయితే ఈ సారి నేరుగా సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నారు. జిల్లాల వారీగా లిస్టులు ప్రకటించి, సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తారు. సెప్టెంబర్ నెల మొదటి వారంలో జాబితాలను సిద్ధం చేసి, రెండో వారంలో పోస్టింగ్‌లు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.