Andhrapradesh: 16,347 టీచర్‌ పోస్టులు.. 6వ తేదీన నోటిఫికేషన్‌!

సీఎం చంద్రబాబు సర్కార్‌.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పట్టాలు ఎక్కిస్తోంది. 16,347 పోస్టులతో నవంబర్‌ 6వ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

By అంజి  Published on  30 Oct 2024 4:28 AM GMT
AP Government, Mega DSC notification

Andhrapradesh: 16,347 టీచర్‌ పోస్టులు.. 6వ తేదీన నోటిఫికేషన్‌!

అమరావతి: సీఎం చంద్రబాబు సర్కార్‌.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పట్టాలు ఎక్కిస్తోంది. 16,347 పోస్టులతో నవంబర్‌ 6వ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెగా డీఎస్సీ పోస్టులు భర్తీకి కార్యాచరణ మొదలు పెట్టిన ప్రభుత్వం.. నోటిఫికేషన్‌ విడుదలకు కసరత్తు చేస్తోంది. మూడు నాలుగు నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరానికి పోస్టింగులు ఇచ్చేలా ప్లాన్‌ రెడీ చేసింది.

ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలు, రోస్టర్‌ పాయింట్లు, సమాంతర రిజర్వేషన్ల వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారుల నుంచి సేకరించింది. సమ్మర్‌లో టీచర్లకు శిక్షణ కూడా పూర్తి చేయనుంది. ఇప్పటి వరకు ఏపీలో 12 వేల స్కూళ్లు ఒకే టీచర్‌తో నడుస్తున్నాయి. ఈ కొత్త నియామకాలతో టీచర్ల సంఖ్య పెరుగుతుంది. మరోవైపు టెట్‌ తుది కీ నిన్న విడుదల కాగా, నవంబర్‌ 2వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. టెట్‌ ఫలితాలు విడుదల చేసిన తర్వాత డీఎస్సీ ప్రకటిస్తే కొత్తవారు కూడా దరఖాస్తు చేసుకునే వీలు కలుగుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Next Story