తెలంగాణలో త్వరలో మరో డీఎస్సీ!

తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఫిబ్రవరిలో 6 వేల టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్టు తెలిపింది.

By అంజి  Published on  15 Dec 2024 12:00 PM IST
DSC, Telangana , Deputy CM Bhatti, teacher jobs

తెలంగాణలో త్వరలో మరో డీఎస్సీ!

తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఫిబ్రవరిలో 6 వేల టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇప్పటికే 11 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేయగా.. ఇటీవల టెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించింది. జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు టెట్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించనుంది. టెట్‌ ఎగ్జామ్స్‌ ముగిసిన తర్వాత జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం.. నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

త్వరలోనే 6 వేల టీచర్‌ ఉద్యోగాలను భర్తీ చేయడానికి డీఎస్‌సీ నోటిఫికేషన్‌ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. నిన్న ఖమ్మం జిల్లా బోనకల్‌ గురుకుల స్కూలులతో విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. గత పదేళ్లు డీఎస్‌సీ నోటిఫికేషన్‌ ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌ విద్యా వ్యవస్థను నాశనం చేసిందన్నారు. తాము అధికారంలోకి రాగానే 11 వేల టీచర్‌ ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడించారు.

అప్పటిలోగా ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ రిపోర్ట్‌ ఇవ్వనుంది. ఈ రిపోర్ట్‌ ఆధారంగా న్యాయ వివాదాలు తలెత్తకుండా నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. మరోవైపు ట్రాన్స్‌కో, టీజీఎన్‌పీడీసీఎల్‌, టీజీఎస్‌పీడీసీఎల్‌లలో ఏఈఈ, ఏఈ, సబ్‌ ఇంజినీర్‌, ఇతర పోస్టులకు సంబంధించి ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ పోస్టులకు అక్టోబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉండగా.. పదోన్నతుల కారణంగా ఆలస్యమైంది.

ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోఉలకు పెద్దపీట వేస్తోంది. గతంలో ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు విడుదల చేయకుండా పెండింగ్‌లో ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయడంతో పాటు కొత్త పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వడానికి సమాయత్తమవుతోంది. మరోవైపు విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. దీని ద్వారా విద్యార్థులు ప్రైవేట్‌ సెక్టార్‌లో ఉద్యోగాలు సాధించగలుగుతారని భావిస్తోంది.

Next Story