ఆంధ్రప్రదేశ్ యువతకు గుడ్‌న్యూస్.. ఉద్యోగావకాశం
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.
By Srikanth Gundamalla Published on 26 Jun 2024 4:30 AM GMTఆంధ్రప్రదేశ్ యువతకు గుడ్‌న్యూస్.. ఉద్యోగావకాశం
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. డిప్లొమా పూర్తి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ ట్రైనింగ్ ప్రొగ్రామ్ ద్వారా ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది ప్రభుత్వం. తిరుపతిలోని శ్రీసిటీలో ఉన్న ఆల్‌స్టోమ్ సహకారంతో కల్పిస్తున్న ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవలని అధికారులు కూడా సూచిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెల్లడించింది. డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు అనీ.. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చని సూచించింది. డిప్లొమా (మెకానికల్, ఈసీఈ, ఈఈఈ, ఆటోమొబైల్), ఐటీఐ (వెల్డర్స్)కు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
డిప్లొమో 2021, 2022, 2023, 2024లో డిప్లొమో పూర్తి చేసిన విద్యార్థులు అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ అర్హులుగా నిర్ణయించారు. వయసులో నిబంధన పెట్టారు. ఏజ్ కచ్చితంగా 18 ఏళ్ల నుంచి 22 మధ్య ఉండాలని చెప్పారు. ఈ ఉద్యోగాల్లో ఏడాదికి రూ.2.55 లక్షలతో పాటుగా మరో రూ.20వేలు సైట్ అలవెన్స్ అందించనున్నారు. మొత్తం దాదాపు రూ.3లక్షల ప్యాకేజ్ ఇవ్వనున్నారు. ఈ ఉద్యోగాల్లో మొత్తం 60 ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. 45 రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు.
ట్రైయినింగ్ పూర్తయిన తర్వాత తిరుపతిలోని శ్రీసిటీలో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. జీతంతో పాటు ఉచితంగా భోజనం, ట్రాన్స్‌పోర్ట్, రెండువారాల పాటు ఉచితంగా వసతి కల్పిస్తారు. ఉద్యోగంలో చేరిన వారిని రూ.6లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుందని సదురు కంపెనీ తెలిపింది. అర్హత ఉండి ఆసక్తి ఉన్నవారు రెస్యూమ్, పాస్‌పోర్టు సైజ్ ఫొటో, విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్స్‌ను, ఆధార్ కార్డు జీరాక్స్‌లు అందించాల్సి ఉంటుంది. కాగా.. రిజిస్ట్రేషన్‌కు చివది తేదీ ఈ నెల 28 వరకు అవకాశం కల్పించారు. ఈ సదుపాయన్ని అర్హులైన నిరుద్యోగులు వినియోగించుకోవాలని సూచించారు.