ఏపీలో కొత్త ప్రభుత్వం మెగా డీఎస్సీ.. పోస్టుల వివరాలు ఇదిగో..

16,347 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు కొత్త ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

By Srikanth Gundamalla  Published on  13 Jun 2024 2:45 PM GMT
andhra pradesh, mega dsc, notification, cm chandrababu,

ఏపీలో మెగా డీఎస్సీ.. పోస్టుల వివరాలు ఇదిగో..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గురువారం బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయన తొలి సంతకం మెగా డీఎస్పీపై పెట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు కొత్త ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. కాగా.. 6100 పోస్టుల భర్తీకి గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవరిస్తూ.. కూటమి ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా 16347 పోస్టులను భర్తీ చేస్తుండటంతో నిరుద్యోగులుసంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గత వైసీపీ ప్రభుత్వం 2024 ఏడాది మొదట ఎన్నికలకు ముందే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 6,100 టీచర్‌ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 2280 ఎస్టీటీ, 2299 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. 1264 టీజీటీ, 215 పీజీటీ, 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. తాజాగా టీడీపీ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను సవరించి.. కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల హామీ మేరకు 16374 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వనుందని తెలుస్తోంది. ఇందులో ఎస్టీటీ 6,371 పోస్టులు ఉండగా.. పీఈటీ 132, స్కూల్‌ అసిస్టెంట్‌ 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపల్ పోస్టులు 52 ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Next Story