తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్‌

Alert for Police Constable Candidates.. Download Hall Tickets from tomorrow. తెలంగాణ పోలీసు కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అల్టర్‌.. రేపటి నుంచి కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌ అర్హత పరీక్ష హాల్ టికెట్లను రేపటి

By అంజి  Published on  17 Aug 2022 9:32 PM IST
తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్‌

తెలంగాణ పోలీసు కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అల్టర్‌.. రేపటి నుంచి కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌ అర్హత పరీక్ష హాల్ టికెట్లను రేపటి నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇవాళ తెలిపింది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఆగస్ట్‌ 26 అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పింది. www.tslprb.in వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని బోర్డు పేర్కొంది. ఈ హాల్ టికెట్లకు సంబంధించి ఏవైనా సందేహాలున్నా, డౌన్‌లోడ్ కాకపోయినా.. support@tslprb.inకి మెయిల్ చేయాలని లేదంటే 93937 11110, 93910 05006 నంబర్లలో సంప్రదించాలని టీఎస్​ఎల్​పీఆర్​బీ సూచించింది.

ఈ నెల 28న కానిస్టేబుల్ ప్రాథమిక అర్హత పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగనున్నది. 15,644 పోలీస్ కానిస్టేబుల్‌, ఎక్సైజ్‌ అండ్‌ ప్రొబిషన్‌లో 614 ఆబ్కారీ కానిస్టేబుల్‌, రవాణా శాఖలో 63 కానిస్టేబుల్‌ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం 1601 పరీక్షా కేంద్రాలను అధికారులు ఎంపిక చేశారు. ఆయా కానిస్టేబుల్‌ పోస్టులకు 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తెలిపింది.

Next Story