ఢిల్లీలోని ఎయిమ్స్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 4,597 పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ కోసం దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు పరీక్షలు నిర్వహించనుంది.
పరీక్షకు వారం లేదా మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.3000, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.2400 చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. అభ్యర్థులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు https://rrpdocuments.aiimsexams.ac.inను సంప్రదించండి.