ఏపీలో టెన్త్‌ అర్హతతో పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలు.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.!

Adhrapradesh postal circle recruitment. ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ సర్కిల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్పోర్ట్స్‌ కోటాలో ఈ ఉద్యోగాలాను భర్తీ

By అంజి  Published on  17 Nov 2021 5:54 AM GMT
ఏపీలో టెన్త్‌ అర్హతతో పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలు.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.!

ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ సర్కిల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్పోర్ట్స్‌ కోటాలో ఈ ఉద్యోగాలాను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 75 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టల్‌ సర్కిల్‌ విడుదల చేసిన పోస్టుల్లో పోస్టల్‌ అసిస్టెంట్‌, సార్టింగ్‌ అసిస్టెంట్‌, పోస్టల్‌ అసిస్టెంట్‌ ఇన్‌ సర్కిల్‌ ఆఫీస్‌, పోస్టల్‌ అసిస్టెంట్‌ ఇన్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌, పోస్ట్‌మ్యాన్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌కు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. నవంబర్‌ 27వ తేదీ వరకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.200 ఫీజు చెల్లించాలి. ఇక మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

మొత్తం 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో పోస్టల్‌ అసిస్టెంట్‌ -19, సార్టింగ్‌ అసిస్టెంట్‌ - 04, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సర్కిల్ ఆఫీస్/రీజనల్ ఆఫీస్- 03, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్- 04, పోస్ట్ మ్యాన్- 18, మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 27 పోస్టులు ఉన్నాయి. ఇక పోస్టల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి ఇంటర్‌ పాస్‌ అయ్యి ఉండాలి. పోస్ట్‌ మ్యాన్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్ పాస్‌తో పాటు తెలుగు భాషపై పరిజ్ఞానం ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకునే వారు 10వ తరగతి పాస్‌ అయి.. స్థానిక భాషపై పరిజ్ఞానం ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.25 వేల నుండి రూ.81 వేల వరకు అర్హతను బట్టి వేతనం ఉంటుంది.

Next Story