తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి రావడంతో త్వరలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. గత ఏడాది విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను రీషెడ్యూల్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ కారణంగా కొన్ని నెలలుగా నోటిఫికేషన్లు ఆగిపోయాయి. ఈ నెల చివరిలోపు మహిళా శిశు సంక్షేమశాఖలో ఖాళీగా ఉన్న 14,236 అంగన్‌వాడీ పోస్టులు, ఆర్టీసీలో 3,038 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నెలలోనే పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ రావాల్సి ఉండగా.. కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
బీట్ ఆఫీసర్ పోస్టులకు మరోసారి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. గురుకులాల్లో బ్యాక్‌లాగ్ పోస్టులు, డిగ్రీ లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు, గురుకుల డిగ్రీ లెక్చరర్లు, సింగరేణి కాలరీస్, ఇంజినీరింగ్ పోస్టులకు సంబంధించి వరుసగా నోటిఫికేషన్ రానున్నాయి. టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ విడుదల కాగా.. టెట్ పూర్తయిన తర్వాత మరో 5 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. గ్రూప్1, గ్రూప్2,గ్రూప్3 పోస్టుల భర్తీ విడుదల చేయనున్నారు.