తెలంగాణ విద్యుత్‌ శాఖలో 3 వేల ఖాళీలు!

తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రెడీ అవుతోంది. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం.. అక్టోబర్‌లో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది.

By అంజి  Published on  20 Sept 2024 12:00 PM IST
vacancies, Telangana, Electricity Department, Jobs

తెలంగాణ విద్యుత్‌ శాఖలో 3 వేల ఖాళీలు!

తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రెడీ అవుతోంది. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం.. అక్టోబర్‌లో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. ఖాళీల వివరాలను పంపాలని విద్యుత్‌ సంస్థలను అడిగినట్టు సమాచారం. దీంతో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సంస్థల యాజమాన్యాలు సేకరిస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. 4 విద్యుత్‌ సంస్థల్లో 3 వేలకుపైగా ఖాళీలు ఉన్నట్టు తేలింది. పోస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది.

వీటన్నింటినీ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. దిస్కం, ట్రాన్స్‌కోలో ఉన్న ఉద్యోగులకు ఇటీవల పదోన్నతులు కల్పించడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. జెన్‌కో మరికొందరికి పదోన్నతులు కల్పించాల్సి ఉంది. దీంతో కింది స్థాయిలో భారీగా ఖాళీలు ఉండనున్నాయి. డిస్కంలలో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌, జూనియర్‌ లైన్‌మెన్‌, సబ్‌ ఇంజినీర్లు, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు, ట్రాన్స్‌ కో, జెన్‌కోలలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం.

Next Story