జాబ్స్ అలర్ట్..టెన్త్ అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 22,195 గ్రూప్-డి (లెవల్-1) పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది.
By - Knakam Karthik |
జాబ్స్ అలర్ట్..టెన్త్ అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 22,195 గ్రూప్-డి (లెవల్-1) పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో సికింద్రాబాద్ (దక్షిణ మధ్య రైల్వే) జోన్ పరిధిలో కూడా 1,012 ఖాళీలు ఉండటం విశేషం.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభం: జనవరి 31, 2026
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 2, 2026 (రాత్రి 11:59 వరకు)
ఫీజు చెల్లింపు చివరి తేదీ: మార్చి 4, 2026
దరఖాస్తు సవరణ : మార్చి 5 నుండి మార్చి 14, 2026 వరకు
అర్హతలు & వయోపరిమితి:
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (SNC/SSC) ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ITI (NCVT/SCVT గుర్తింపు పొందినది) లేదా నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) కలిగి ఉండాలి. వయస్సు జనవరి 1, 2026 నాటికి 18 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. SC/STలకు 5 ఏళ్లు, OBCలకు 3 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది).
ఎంపిక విధానం:
అభ్యర్థులను మొత్తం నాలుగు దశల్లో ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ రాత పరీక్ష (మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, జనరల్ అవేర్‌నెస్). శారీరక సామర్థ్య పరీక్ష (పరుగు మరియు బరువు మోయడం). ధృవపత్రాల పరిశీలన. వైద్య పరీక్షలు.
దరఖాస్తు రుసుము: జనరల్/OBC/EWS: రూ. 500 (పరీక్ష రాసిన తర్వాత రూ. 400 రీఫండ్ చేయబడుతుంది). SC/ST/మహిళలు/Ex-SM/PwBD: రూ. 250 (పరీక్ష రాసిన తర్వాత మొత్తం రూ. 250 రీఫండ్ చేయబడుతుంది).
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత గల అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి కేవలం ఒకే ఒక ఆర్ఆర్బీ జోన్‌కు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.