ఏపీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు
By రాణి Published on 11 March 2020 8:38 AM GMTఏపీలో నిరుద్యోగులకు శుభవార్తను అందించాయి పలు సంస్థలు. కొంతకాలంగా ఉద్యోగాలు లేక..నిరుద్యోగులుగా తిరుగుతున్న వారికోసం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇస్రో, హిందుస్థాన్ షిప్ యార్డ్ లలో ఉద్యోగాలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీల వివరాలు
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫైర్ మెన్ వంటి పోస్టులను భర్తీ చేస్తోంది. దరఖాస్తు చేయడానికి 2020 మార్చి 27వ తేదీ చివరితేది. ఆసక్తిగల అభ్యర్థులు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అధికారిక వెబ్‌సైట్ https://www.shar.gov.in/ ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్‌లో పూర్తి వివరాలు చూడొచ్చు. అక్కడే దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు.
Also Read : వాటర్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన TSPSC
మొత్తం 12 ఖాళీలుండగా..నర్స్ బీ 2, ల్యాబ్ టెక్నీషియన్ ఏ 3, ఫైర్ మ్యాన్ ఏ 7 భర్తీ చేయనున్నారు. మార్చి 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అభ్యర్థులు ఆయా పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
విద్యార్హతలు, వయస్సు :
నర్స్ : 10వ తరగతి పాస్, మూడేళ్లు నర్సింగ్ కోర్స్ పూర్తి, 18-35 ఏళ్ల వయస్సు.
ల్యాబ్ టెక్నీషియన్ : టెన్త్ తో పాటు డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ సర్టిఫికేట్, 18-35 ఏళ్ల లోపు వయసున్నవారు అర్హులు.
ఫైర్ మ్యాన్ ఏ : టెన్త్ పాస్, 18-25 ఏళ్ల లోపు వయసు.
For Apply :
https://apps.shar.gov.in/Advt012020/main.jsp
విశాఖపట్నంలోని హిందూస్తాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో డిజైనర్, జూనియర్ సూపర్‌వైజర్, ఆఫీస్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 51 ఖాళీలను ప్రకటించింది. ఏప్రిల్ 7వ తేదీ లోపు ఆయా పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాల కోసం https://www.hslvizag.in/ లాగిన్ అవ్వండి.
భర్తీల వివరాలు :
డిజైనర్ Gr-IV (మెకానికల్)- 10
డిజైనర్ Gr-IV (ఎలక్ట్రికల్)- 03
జూనియర్ సూపర్‌వైజర్ Gr-III (మెకానికల్)- 07
జూనియర్ సూపర్‌వైజర్ Gr-III (ఎలక్ట్రికల్)- 09
జూనియర్ సూపర్‌వైజర్ Gr-III (సివిల్)- 07
ఆఫీస్ అసిస్టెంట్ (సెక్రెటేరియల్) Gr-V- 09
జూనియర్ ఫైర్ ఇన్‌స్పెక్టర్ Gr-IV- 04
డ్రైవర్ Gr V- 02
Also Read : భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఏప్రిల్ 7వ తేదీలోపు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తును పూర్తి చేసి, దానిని ప్రింట్ తీసుకుని మీ డిప్లమో, గ్రాడ్యుయేట్ లకు సంబంధించిన విద్యార్హతల జిరాక్సులను జత చేసి
General Manager (HR)A.C.,
Hindustan Shipyard Ltd.,
Gandhigram (PO),
Visakhapatnam. అడ్రస్ కు పోస్ట్ లో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేందుకు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
For Application :
https://www.hslvizag.in/currentopenningrecruitment.aspx