సామాన్యుడికి కొంత ఊరట లభించింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా తగ్గాయి. పెట్రోలియం సరఫరా చేసే దేశాల మధ్య ధరల యుద్ధం తీవ్రం కావడంతో గ్లోబల్‌ మార్కెట్‌ ధరలు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పెట్రోల్‌ ధర రూ.2.69పైసలు, డీజిల్‌ ధర రూ.2.33పైసల మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం పెట్రోల్‌ లీటర్‌ ధర రూ. 70.29 పైసలు కాగా, డీజిల్‌ లీటర్‌ ధర రూ.63.01కు తగ్గింది. అంతేకాదు మరో పదిహేను రోజుల పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పతనం కావడంతోనే  ఈ ధరలు తగ్గినట్లు తెలుస్తోంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.