ఏపీలో ఉద్యోగాల వాన..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 6:27 AM GMT
ఏపీలో ఉద్యోగాల వాన..!

అమరావతి: నిరుద్యోగులకు వైసీపీ ప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఖాళీగా ఉన్న గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పలు కారణాలతో ఖాళీ అయిన వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో 9,674 గ్రామ వాలంటీర్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ ఓ ప్రకటనతో తెలిపారు. నవంబర్‌ 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. నవంబర్‌ 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం నవంబర్‌ 15 నుంచి దరఖాస్తులు పరిశీలించనున్నారు. 16 నుంచి 20 వరకు అభ్యర్థులకు ఇంటర్య్వూలు జరగనున్నాయి. డిసెంబర్‌ 1 నుంచి ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరాల్సి ఉంటుంది. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ల ద్వారా ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల్లో ఉన్న ఖాళీలను ప్రకటించి అధికారులు గ్రామ వాలంటీర్ల భర్తీ చేపట్టనున్నారు.

Next Story
Share it