Fact Check : యునైటెడ్ నేషన్స్ కాశ్మీర్ ను ప్రత్యేక దేశంగా ప్రకటించిందా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Jun 2020 7:35 PM ISTభారత్-పాకిస్థాన్ దేశాల మధ్యన సరిహద్దు సమస్య ఎన్నాళ్లుగానో నడుస్తూ ఉంది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఇప్పటికీ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. భారత్ కు చెందిన భూభాగం అయినప్పటికీ పాకిస్థాన్ మాత్రం ఆ ప్రాంతం తమకే చెందినదంటూ పిచ్చి ప్రేలాపణలు చేస్తోంది. అమాయకమైన కాశ్మీరీ యువతను రెచ్చగొట్టి భారత్ కు వ్యతిరేకంగా గన్ను పట్టుకునే విధంగా తయారుచేస్తూ ఉంది. తాజాగా జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. యునైటెడ్ నేషన్స్(ఐక్యరాజ్యసమితి) జమ్మూ కాశ్మీర్ ను ప్రత్యేక దేశంగా ప్రకటించిందని.. అందుకు సంబంధించిన మ్యాప్ కూడా వెలువడింది అంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు.
‘Saday-e-Kashmir’ ఫేస్ బుక్ పేజీలో యునైటెడ్ నేషన్స్ విడుదల చేసిన సరికొత్త మ్యాప్ లో జమ్మూ కాశ్మీర్ ను ప్రత్యేక దేశంగా ప్రకటించింది అంటూ పోస్టు పెట్టారు. www.un.org in లో ఆ మ్యాప్ లభిస్తుంది అంటూ అందులో పోస్ట్ చేశారు.
“#Jammu & #Kashmir in #World map issued by #UNO. Recognized as Country…This map is available on www.un.org in pdf file. (sic)”
ఈ పోస్ట్ కు 50 షేర్స్, 100 లైక్స్ వచ్చాయి.
Guess What?????
.
.
Jammu and Kashmir Is a CountrY.👇👇👇@carin__fischer @Shahrukh_dar147
Courtesy: @UN World Map. pic.twitter.com/cEwMxb45QH
— Tajamul Islam ( تجمل اسلام) (@Tajamul_Tweets) June 24, 2020
ట్విట్టర్ లో కూడా ఈ పోస్టును షేర్ చేశారు కొందరు.
నిజ నిర్ధారణ:
ఆ పోస్టులో చెప్పినట్లుగా వెబ్ సైట్ లింక్ ను ఓపెన్ చేయగా యునైటెడ్ నేషన్స్ కు చెందిన వరల్డ్ మ్యాప్ ను చూడొచ్చు. ఆ వరల్డ్ మ్యాప్ ను జూమ్ చేయగా జమ్మూ కాశ్మీర్ లోని ప్రాంతాలు రెండుగా విడిపోవడం చూడొచ్చు. చిన్న చిన్న చుక్కలు ఉన్న ప్రాంతం లైన్ ఆఫ్ కంట్రోన్(నియంత్రణ రేఖ) అని స్పష్టంగా తెలుస్తోంది.
“The boundaries and names shown and the designations used on this map do not imply official endorsement or acceptance by the United Nations.” అంటూ అదే పిడిఎఫ్ ఫైల్ లో ఉంది. కేవలం ఒక మ్యాప్ మాత్రమేనని.. అధికారికంగా చెప్పింది కాదని వెల్లడించింది.
“*Dotted line represents approximately the Line of Control in Jammu and Kashmir agreed upon by India and Pakistan. The final status of Jammu and Kashmir has not yet been agreed upon by the parties.” అంటూ జమ్మూ కాశ్మీర్ ప్రస్తావన తీసుకొని వచ్చింది. ఆ చుక్కలు ఉన్న ప్రాంతం నియంత్రణ రేఖకు చెందినదని.. జమ్మూ కాశ్మీర్ ఫైనల్ స్టేటస్ పై భారత్ పాకిస్థాన్ ఇంకా ఎటువంటి నిర్ణయానికి రాలేదంటూ స్పష్టం చేసింది.
ఇటువంటి చుక్కలు ఉన్న లైన్ సూడాన్, సౌత్ సూడాన్ మధ్య కూడా ఉంది. ఆ దేశాలు కూడా సరిహద్దు విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.
జమ్మూ కాశ్మీర్ ను యునైటెడ్ నేషన్స్ ప్రత్యేక దేశంగా ప్రకటించడం అన్నది 'పచ్చి అబద్దం'