తెలంగాణ‌లో జియో ఫైబ‌ర్ బంఫ‌ర్ఆఫ‌ర్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 April 2020 3:48 AM GMT
తెలంగాణ‌లో జియో ఫైబ‌ర్ బంఫ‌ర్ఆఫ‌ర్‌

క‌రోనా విజృంభ‌న కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ కార‌ణంగా ఆఫీసుల‌న్నీ మూత‌ప‌డ‌టంతో ఉద్యోగులంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. చాలావ‌ర‌కూ అన్ని కంపెనీలు వ‌ర్క్ ఫ్రం హోమ్‌ను కొన‌సాగిస్తున్నాయి. దీంతో ఇంట‌ర్నెట్ వినియోగం విప‌రీతంగా పెరిగింది. అయితే.. దేశీయ టెలికం సంస్థ జియో.. వినియోగ‌దారుల‌ను దృష్టిలో ఉంచుకుని బంఫ‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.

వివ‌రాళ్లోకెళితే.. జియో ఫైబర్ తన క‌స్ట‌మ‌ర్లంద‌రికీ అన్ని ప్లాన్స్ లోనూ డబుల్ డేటాను ఆఫర్ చేస్తోంది. దీనికి సంబంధించి తమ వినియోగదారులు హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌కు క‌నెక్ట్ అయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు జియో ఫైబర్ పేర్కొంది. రాజ‌ధాని హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ సేవ‌ల‌ను అందించ‌నున్న‌ట్లు జియో ఫైబ‌ర్‌ పేర్కొంది.

ఇప్ప‌టికే హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలలోని ప్ర‌ధాన పట్ట‌ణాల‌లో హై-స్పీడ్ బ్రాడ్ బాండ్ సేవలను అందించేందుకు తన నెట్‌వర్క్ సామర్థ్యాన్ని జియో పెంచింది. ఇక‌ స్టే కనెక్టెడ్, స్టే ప్రొడక్టివ్ నినాదంతో ముందుకు వెలుతున్న జియో.. కొత్త క‌స్ల‌మ‌ర్ల‌కు 10 ఎంబీపీఎస్ స్పీడ్, 100 జీబీ డేటాతో ఉచిత కనెక్ష‌న్‌ ఇస్తోంది. అలాగే.. తెలంగాణ‌లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో అంత‌కుముందున్న వినియోగ‌దార్ల‌కు జియో ఫైబర్ తన హై స్పీడ్ బ్రాడ్‌బాండ్ స్పీడ్ ను 1 గిగా ఫైబర్ వ‌ర‌కూ పెంచింది.

Next Story
Share it