గుండెలు అదిరే మాట.. రెండు నెల‌లు ఆగితే దేశంలో 20 కోట్ల కేసులు?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Jun 2020 7:11 AM GMT
గుండెలు అదిరే మాట.. రెండు నెల‌లు ఆగితే దేశంలో 20 కోట్ల కేసులు?

విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. పొద్దుపొద్దున్నే నిద్రమత్తు దెబ్బకు వదిలిపోవటమే కాదు.. ఒళ్లంతా భయం కమ్మేసే పరిస్థితి. ఇంతకీ ఆయన చెప్పిన మాటలతో అంతలా వణికిపోవాల్సిన అవసరం ఏమిటి? ఇంతకీ ఆయన ఎవరు? ఆయన మాటల్ని అంత సీరియస్ గా ఎందుకు తీసుకోవాలి? ఇంతకీ ఆయన చెప్పిందేమిటి? అన్న విషయాల్లోకి వెళితే..

నేషనల్ టాస్క్ ఫోర్సు సభ్యులు కమ్ ప్రముఖ సాంక్రామిక వ్యాధుల నిపుణుడు అయిన డాక్టర్ జయప్రకాశ్ మలీల్ అనే పెద్ద మనిషి తెలుగు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటల్ని విన్నంతనే మనసంతా చేదుఅయిపోవటం ఖాయం. ఇప్పుడున్న పద్దతిలోనే సాగితే.. రానున్న రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య భారీ పెరుగుతున్న అంచనా వేశారు. తాజాగా ఆయన ప్రముఖ పర్యావరణ మేగజైన్ లో నేచర్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు కొన్ని చేశారు. వాటిలో ముఖ్యమైన అంశాల్ని చూస్తే..

  • వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో పలు దేశాలు బాగా దెబ్బ తిన్నాయి. మొదట్లో నగరాలు.. తర్వాత పట్టణాలు.. ఇప్పుడేమో గ్రామాలు సైతం ఈ వైరస్ ముప్పును ఎదుర్కొంటున్నాయి. అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. లండన్ లో పాజిటివ్ కేసులు తీవ్రత పెరిగినప్పుడు ఇతర పట్టణాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
  • ఇప్పుడు అదే విధానాన్ని భారత్ లోనూ అమలు చేయాలి. జాగ్రత్తలు తీసుకోని కారణంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది. సెప్టెంబరునాటికి భారత్ లో 20 కోట్ల కేసులువస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య ఎక్కువగా కనిపించొచ్చు కానీ.. మన దేశ జనాభా 138 కోట్లు. దాంతో పోలిస్తే.. 20 కోట్ల సంఖ్య తక్కువగా కనిపించే అవకాశం ఉంది.
  • సమస్యంతా ఇంత భారీగా కేసులు నమోదు అయితే.. వారందరికి వైద్యం.. ఆరోగ్యం అందించే వ్యవస్థలు మన దగ్గర లేవు. అందుకే చికిత్సను పెంచటంతో పాటు.. ఆక్సిజన్ సదుపాయాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకెళ్లాలి. లాక్ డౌన్ కు దేశంలో మంచి స్పందన రాలేదు. ప్రజలెంతో ఇబ్బందులకు గురయ్యారు.
  • ముందుగా ఆలోచించి లాక్ డౌన్ ప్రకటిస్తే ఇంత నష్టం జరిగేది కాదు. సమయం మించిపోతుందని లాక్ డౌన్ విధించారు. దీని వల్ల దేశానికి నష్టమే జరిగింది. లాభం జరిగింది చాలా తక్కువ. హటాత్తుగా లాక్ డౌన్ ప్రకటించటం కారణంగా వలస కార్మికులు.. దినసరి జీతాల మీద బతికేవారు.. ఇలా అనేక మంది మరణించారు.
  • మహమ్మారిపై జరుగుతున్న యుద్ధంలో గెలుపోటములు అన్నవేమీ ఉండవు. ఒకసారి వ్యాపించటం మొదలైన తర్వాత అంతా షెడ్యూల్ ప్రకారమే సాగుతుంది. జాగ్రత్తలు తీసుుంటే తగ్గుతుంది. లాక్ డౌన్ తో అడ్డుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు వైరస్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రెండింటిలోనూ విజయం సాధించలేదు. తక్కువ జనాభా ఉన్న దేశాల్లోనే ఇది సాధ్యమవుతుంది.
  • ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో వైరస్ తో సహజీవనం చేయటం నేర్చుకోవాలి. వీలైనంత హెల్త్ ఇమ్యునిటీని పెంచుకోవటం అవసరం.
  • వేరే దేశాలు.. రాష్ట్రాల్లో ఉన్న వారు తమ ప్రాంతాలకు వస్తే.. వారిని వారి ఇళ్లల్లో కాకుండా హోటళ్లు.. ఆసుపత్రుల్లో క్వారంటైన్ చేస్తున్నారు. ఇది సరికాదు. వీరిలో చాలామందికి పరీక్షలు జరగటం లేదు. అసలు వీరికి మహమ్మారి సోకిందో లేదో కూడా తెలీదు.
  • ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద వయస్కుల వారిని స్వచ్ఛందంగా క్వారంటైన్ చేయటం.. వారిని ఇతరుల నుంచి కాపాడుకోవటం. రెండోది.. ఆసుపత్రుల్లో సదుపాయాలు కల్పించి.. రోగులకు ఆక్సిజన్ సౌకర్యాలు కలుగజేయటం ద్వారా ఎక్కువమందిని రక్షించుకోవచ్చు.

Next Story