అమరావతి: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి జనసేన అధ్యక్షడు పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ బయల్దేరారు. ఢిల్లీలో ప్రధానంగా రాజధాని ఆందోళనల అంశాన్ని పవన్‌ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. అయితే కేంద్ర పెద్దలను ఎవరెవరినీ కలుస్తారన్న దానిపై మాత్రం జనసేన గోప్యత వ్యహరిస్తోంది. ఢిల్లీ రావాలని కేంద్ర పెద్దల నుంచి పవన్‌కల్యాణ్‌కు ఫోన్‌ వచ్చినట్టుగా తెలుస్తోంది. శుక్రవారం నాడు రాజధాని గ్రామాల్లో పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. రాజధాని వ్యవహాంరపై కేంద్రంతో మాట్లాడతానని పవన్‌ రైతులకు చెప్పారు. మంగళగిరిలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం పవన్‌ నేరుగా ఢిల్లీ బయల్దేరారు. అమరావతి పర్యటనను పవన్‌ కల్యాణ్‌ అర్థరాంతరంగా ముగించారు. రాజధాని సమస్యతో పాటు, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై పవన్‌ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్నారు.

జనసేన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై కీలక చర్చ జరిగింది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని కొందరు నేతలు పార్టీ అధిష్టానానికి సూచించినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఒంటరిగా పోటీ చేయడం వల్లే వైసీపీకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చాయని సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా లేదని మరి కొందరు నేతలు చెప్పారు. బీజేపీ, వైసీపీ మనిహాయిస్తే.. ఇతర పార్టీలతో పొత్తుపై ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లోనైనా తమ అభ్యర్థునుల గెలిపించుకోవాలని జనసేన భావిస్తోంది. సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరిగింది. 50 శాతం టిక్కెట్లు యువతకు ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌ భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రకటన చేయకుండా ప్రత్యక్ష కార్యాచరణ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని పవన్‌ కల్యాణ్‌ పార్టీ నేతలకు చెప్పారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.