హైదరాబాద్ : హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ జనసేన మద్దతును కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ విష‌య‌మై జనసేన తెలంగాణ ఇంచార్జ్ ఎన్. శంకర్ గౌడ్, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, పార్టీ అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ లతో చర్చించారు. హుజూర్ నగర్ లోని రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడారు. అక్కడి కాంగ్రెస్ అభ్యర్థికి జనసేన మద్దతు కోరారు. ఇందుకు సంబంధించి లేఖను అందచేసి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి వివరాలు తెలియచేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.