సీఎం జగన్‌పై జనసేన చీఫ్ పవన్ ఫైర్..!
By న్యూస్‌మీటర్ తెలుగు
విజయవాడ: మేము పాలసీలపై మాట్లాడుతుంటే.. సీఎం జగన్ మాత్రం వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఇసుక.. భవన నిర్మాణానికి ముఖ్యమైన ముడి సరుకు. గత ప్రభుత్వంలో కూడా జరిగిన తప్పిదాలపై మేము ఎండగట్టామన్నారు. నాలుగు నెలల నుంచి ఇసుక కొరత వల్ల లక్షలాది మంది రోడ్డున పడ్డారన్నారు. 50 మంది భవన కార్మికులు చేసుకున్నారని.. తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 151 ఎమ్మెల్యేలతో ప్రభుత్వం వచ్చింది. ఏడాది వరకు మాకు ఏం పని ఉండదనుకున్నాం.. కానీ ఆరు నెలలకే రోడ్డుపైకి రావాల్సి వచ్చిందన్నారు. సమస్యకు పరిష్కారం చూపమంటే వ్యక్తిగతంగా తిడతారా అంటూ ఫైర్ అయ్యారు. భాషా, సంస్కారాన్ని మరచి ఎన్ని తిట్టినా మేము పట్టించుకోమన్నారు.
నిన్న సందర్భం ఏమిటి.. జగన్ అలాంటి సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు బయటకు రాకుండా మా మీద మాటల దాడి చేస్తున్నారని పవన్ ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాటానికి ఏప్పుడు సిద్ధమేనన్నారు. పాలనపై మేము విమర్శలు చేస్తే.. దాన్ని కులానికి ఆపాదిస్తున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని పవన్ పేర్కొన్నారు. తరచూ మూడు పెళ్లిళ్లు అంటున్న జగన్‌కు అంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చెసుకోండన్నారు. నేను చేసుకున్న పెళ్లిళ్ల వల్లేనా జగన్ రెండేళ్లు జైలులో ఉంది.. అంటూ ఎద్దేవా చేశారు. ఇసుక పాలసీపై ఎమ్మెల్యేలు, మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు.